iDreamPost
android-app
ios-app

షాకిచ్చిన సెలబ్రిటీ కపుల్.. పెళ్లైన ఏడాదికే విడిపోయాం అంటూ..!

  • Published May 30, 2024 | 8:45 PM Updated Updated May 30, 2024 | 8:45 PM

Celebrity Couple Going Separate Their Paths: సినిమా ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో చాలామందే సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో జంట ఆ జాబితాలోకి చేరింది. తాము నిజంగానే విడిపోతున్నాం అంటూ స్వయంగా ప్రకటన కూడా చేశారు.

Celebrity Couple Going Separate Their Paths: సినిమా ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో చాలామందే సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో జంట ఆ జాబితాలోకి చేరింది. తాము నిజంగానే విడిపోతున్నాం అంటూ స్వయంగా ప్రకటన కూడా చేశారు.

  • Published May 30, 2024 | 8:45 PMUpdated May 30, 2024 | 8:45 PM
షాకిచ్చిన సెలబ్రిటీ కపుల్.. పెళ్లైన ఏడాదికే విడిపోయాం అంటూ..!

ప్రస్తుతం సినిమా వాళ్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన కపుల్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నా.. సడెన్ గా విడిపోతున్నా అంటూ ఫ్యాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పటికే పలు జంటలు ఇలా విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జంట ఆ కోవలోకి వెళ్లింది. తాము విడిపోయాం అంటూ కుండ బద్దలు కొట్టేశారు. విడాకుల వార్తలు వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి కేవలం ఏడాది మాత్రమే కావడం గమనార్బం. ఏడాదికే విడాకులు తీసుకుంటున్నాం అనడంతో అంతా నోరెళ్ల బెడుతున్నారు. ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు కారణాల మీద దృష్టి పెట్టారు.

ఇప్పుడు చెప్పుకుంటోంది మరెవరో కాదు.. బాలీవడు కపుల్ దిల్జీత్ కౌర్- నిఖిల్ పటేల్ గురించే. వీళ్లిద్దరు విడిపోయారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, వాటిని కేవలం పుకార్లు అనే అంతా అనుకున్నారు. పైగా కెన్యా నుంచి దిల్జీత్ కౌర్ ఇండియాకి తిరిగిరాగానే ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ విడాకుల వార్తలను స్వయంగా నిఖిల్ పటేల్ అంగీకరించాడు. విడాకుల వార్తలు నిజమే అంటూ స్పష్టం చేశాడు. దిల్జీత్ కౌర్ ఇండియా వచ్చినప్పుడే అంతా అయిపోయినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. వాళ్లిద్దరు నిజంగానే విడిపోతున్నట్లు వెల్లడించాడు.

నిఖిల్ పటేల్ మాట్లాడుతూ.. “మా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. నిజానికి మా మధ్య పెళ్లి అనే పునాది అంత బలంగా పడలేదు. మా పెళ్లి 2023లో అధికారికంగా జరిగినా.. ఇంకా రిజిస్టర్ కాలేదు. మా ఇద్దరి మధ్య చాలానే భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దిల్జీత్ కౌర్ కెన్యా రావడంతో ఇండియాని మిస్ అవ్వడమే కాదు.. తన కెరీర్ ని కూడా కోల్పోయింది. ఆమెకు కెన్యా వాతావరణం అసలు నచ్చలేదు. మా కొడుకు స్కూల్ కి వెళ్లాలి అనుకున్నప్పుడు ఆమెకు తిరిగి కెన్యా వెళ్లే ఆలోచన లేదు అని నాకు అర్థమైంది. మా మధ్య బంధం కూడా అప్పుడే ముగిసిపోయింది అనుకున్నాను.

Dalljiet kaur and nikhil patel getting devorced

దిల్జీత్ కౌర్ కు మంచి జరగాలని కోరుకుంటున్నాను. దిల్జీత్ ఇండియాకి తిరిగి వెళ్లిపోయినప్పుడే మా బంధం ముగిసిపోయినట్లు అయ్యింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా కూడా.. మంచి స్నేహితులుగా మాత్రం కలిసే ఉంటాం” అంటూ నిఖిల్ పటేల్ వెల్లడించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరి విడాకుల వార్త నెట్టింట వైరల్ గా మారింది.ఇప్పటివరకు వచ్చిన వార్తలు పుకార్లు కాదు. నిజమే అని క్లారిటీ వచ్చేసింది. పైగా వారి మధ్య విభేదాలు ఉన్న విషాన్ని నిఖిల్ స్వయంగా అంగీకరించడంతో రావాల్సిన స్పష్టత వచ్చేసింది. మరి.. బాలీవుడ్ కపుల్ పెళ్లైన ఏడాదికే విడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom