iDreamPost
android-app
ios-app

Sai pallavi: సాయి పల్లవిలో సీత లక్షణాలు లేవంటూ.. బాలీవుడ్ నటుడు విమర్శలు

  • Published Jun 21, 2024 | 10:19 AM Updated Updated Jun 21, 2024 | 11:11 AM

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలియనిది కాదు. సౌత్ అంతా కూడా ఆమెను న్యాచురల్ బ్యూటీ గా ఆరాధిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి పై.. సునీల్ లాహ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలియనిది కాదు. సౌత్ అంతా కూడా ఆమెను న్యాచురల్ బ్యూటీ గా ఆరాధిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి పై.. సునీల్ లాహ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 21, 2024 | 10:19 AMUpdated Jun 21, 2024 | 11:11 AM
Sai pallavi: సాయి పల్లవిలో సీత  లక్షణాలు లేవంటూ..  బాలీవుడ్ నటుడు విమర్శలు

ప్రస్తుతం .. లేడీ న్యాచురల్ సూపర్ స్టార్ సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ అంతా కూడా ఆమెను న్యాచురల్ బ్యూటీ గా ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె సినిమాలకు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. తెరపైన ఈ అమ్మడు ఎంత చక్కగా పద్ధతిగా ఉంటుందో.. తెర వెనుక కూడా అంతే పద్దతిగా, హుందాగా ఉంటుంది ఈ అమ్మడు. ఆమె కథల ఎంపిక కూడా అంతే అర్థవంతంగా ఉంటూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆమె నితీష్ తివారి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న.. ప్రతిష్టాత్మకమైన రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో. బుల్లి తెరపైన లక్ష్మణుడిగా పాపులర్ అయినా సునీల్ లాహ్రి.. కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.

రామాయణం సినిమా సెట్స్ నుంచి ఇటీవల కొన్ని ఫొటోస్ లీక్ అయినా సంగతి తెలిసిందే. రాముడిగా రణ్ బీర్ , సీతగా సాయి పల్లవిని చూసి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అభిమానులంతా వీరిద్దరి లుక్స్ ను తెగ పొగిడేశారు. ఇక రామానంద సాగర్ టీవీ సిరీస్ లో ‘రామాయణం’ లో లక్ష్మణుడి పాత్రను పోషించి ఫేమస్ అయినా.. సునీల్ లాహ్రి అందరికి పరిచయమే. అయితే రీసెంట్ గా సునీల్ రామాయణంలో వీరిద్దరి లుక్స్ పై కొన్ని కామెంట్స్ చేశారు. యానిమల్ మూవీని చూశాక రణబీర్ ను రాముడిగా అంగీకరించడం కష్టం అని.. దీనితో రణ్ బీర్ ను రాముడిగా ప్రేక్షకులు ఎంత వరకు ఆరాధిస్తారో తెలియదు అంటూ.. చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి విషయంలో.. నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదు అంటూ .. ఆమె చేసిన సినిమాలను తానూ ఎప్పుడు చూడలేదని. లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.

దీనితో అందరి అభిమాన దేవతపై ఈ రకంగా కామెంట్స్ చేయడంతో.. సాయి పల్లవి అభిమానులు అతనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ సారి ఆమె సినిమాలను చూడాలంటూ సజ్జెస్ట్ చేస్తున్నారు. ఓ సారి ఆమె సినిమాలు చూస్తే.. ఇండియాలోని బెస్ట్ యాక్టర్స్ లో ఆమె కూడా ఒకరనే విషయం అర్ధమౌతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు వారికి సాయి పల్లవి అందరు మెచ్చిన మంచి నటి.. మరి అలాంటిది ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. అభిమానులు ఆమెను ఎక్కడ తగ్గనివ్వరనే విషయం అర్థమైపోతుంది. మరి సునీల్ లాహ్రి సాయి పల్లవిపై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/