iDreamPost
android-app
ios-app

Rajpal Yadav: బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ ఆస్తులు జప్తు.. ఎందుకంటే?

  • Published Aug 15, 2024 | 3:10 PM Updated Updated Aug 15, 2024 | 3:10 PM

బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ ఆస్తిని బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ ఆస్తిని బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 15, 2024 | 3:10 PMUpdated Aug 15, 2024 | 3:10 PM
Rajpal Yadav: బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ ఆస్తులు జప్తు.. ఎందుకంటే?

అతడో స్టార్ కమెడియన్.. రెండు దశాబ్దాలకు పైగా సినిమా లవర్స్ ను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. కమెడియన్ గానే కాకుండా.. డైరెక్టర్ గా నిర్మాతగా మారి పలు సినిమాలను కూడా తెరకెక్కించాడు. ఫిల్మ్ ఫేర్ తో పాటుగా పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో ఇండస్ట్రీలో ఇతడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ తో పాటు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి స్టార్ కమెడియన్ ఆస్తిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రముఖ హాస్యనటుడు ఎవరో కాదు.. రాజ్ పాల్ యాదవ్.

రాజ్ పాల్ యాదవ్.. తన కామెడీతో బాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో, నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో రవితేజ నటించిన ‘కిక్ 2’లో రాజ్ పాల్ యాదవ్ ఓ పాత్రలో మెరిశాడు. కమెడియన్ గానే కాకుండా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి పలు చిత్రాలు నిర్మించాడు. అలాగే కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ స్టార్ కమెడియన్ ఆస్తిని ముంబై సెంట్రల్ బ్యాంక్ అధికారులు జప్తు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే?

Bollywood star comedian Raj Paul's assets are confiscated

2010లో రాజ్ పాల్ యాదవ్ తానే నటిస్తూ, దర్శకత్వం వహించిన ఓ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా కొరకు తన ఆస్తిని బ్యాంకులో కుదువ పెట్టి లోన్ తీసుకున్నాడు. మూవీ డిజాస్టర్ కావడంతో.. ఆ అప్పులు తీర్చలేకపోయాడు. దాంతో రాజ్ పాల్ యాదవ్ కు సంబంధించిన రూ. 11 కోట్ల ఆస్తిని బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. రాజ్ పాల్ ప్రస్తుతం ‘హంగామా 2’లో నటిస్తున్నాడు. ఈ మూవీకి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. ‘భూల్‌భూలయియా’, ‘పార్టనర్‌’, ‘హంగామా’ సినిమాలు రాజ్ పాల్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss