iDreamPost
android-app
ios-app

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

  • Published Feb 10, 2024 | 12:50 PM Updated Updated Feb 10, 2024 | 12:50 PM

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ సెలెబ్రిటీలు ఆసుపత్రి పాలవ్వడం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ సెలెబ్రిటీలు ఆసుపత్రి పాలవ్వడం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 10, 2024 | 12:50 PMUpdated Feb 10, 2024 | 12:50 PM
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

సినీ ఇండస్ట్రీలో వారంత వరుసగా ఒకరి తర్వాత ఒకరు అభిమానులకు .. చేదు వార్తలు మిగిల్చుతున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ ఎవరో ఒక సినీ సెలెబ్రిటీలు ఆసుపత్రి పాలవ్వడం చూస్తూనే ఉన్నాము. అయితే, బాలీవుడ్ లో ఈ నటుడి గురించి తెలియని వారు ఉండరు. బాలీవుడ్ లోనే కాకుండా బెంగాలీ, హిందీ, ఒడియా, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ మరియు పంజాబీతో సహా 350 చిత్రాలలో నటించిన నటుడు మిథున్ చక్రవర్తి. ఈ నటుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అటు సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ మిథున్ చక్రవర్తికి మంచి గుర్తింపు ఉంది. అయితే, తాజాగా ఈయన ఆసుపత్రి పాలయ్యినట్లు వార్తలు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మిథున్ చక్రవర్తి అటు వెండి తెరపైన , రాజకీయాల్లోనే కాకుండా .. బుల్లి తెరపైన కూడా పలు రకాల ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేస్తూ ఉంటారు. అతను డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కంపిటిషన్ కూడా అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమం జీ టీవీ లో ప్రసారం అవుతోంది. అంతేకాకుండా ఇంతలో, అతను 1995 నుండి 1999 వరకు భారతదేశంలో అందరికంటే ఎక్కువ టాక్స్ ను చెల్లించాడు, దీని మూలంగా అంతినికి గొప్ప వ్యాపారవేత్తగా కూడా పేరు వచ్చింది. ఇక 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం మిథున్ కు “పద్మ భూషణ్” ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నేటి ఉదయం (ఫిబ్రవరి 10న) మిథున్ కు గుండె నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే, గతంలో కూడా కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను .. కలకత్తా లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు . కానీ, ఇంకా పూర్తి విషయాలు బయటకు రాలేదు. దీనికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దీనితో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.