iDreamPost
android-app
ios-app

సినీ పరిశ్రమలో విషాదం.. ‘సింగం’ నటుడు కన్నుమూత!

  • Author Soma Sekhar Published - 04:37 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 04:37 PM, Mon - 24 July 23
సినీ పరిశ్రమలో విషాదం.. ‘సింగం’ నటుడు కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సీనియర్ నటీ, నటులు.. టెక్నిషీయన్లు పలు కారణాలతో మరణిస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. తన తండ్రి చనిపోయిన విషయాన్ని ఆయన కుమారుడు మీడియాకు తెలియజేశాడు. స్టార్ హీరో సూర్య నటించిన సూపర్ హిట్ సిరీస్ ‘సింగం’లో ఆయన నటించారు. ఆయన మరణ వార్త తెలియడంతో.. పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా థానేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయంత్ సావర్కర్ కొడుకు కౌస్తుభ్ సావర్కర్ తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం జయంత్ సావర్కర్ కు బీపీ ఎక్కువైంది. దాంతో ఆయనని ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ క్రమంలోనే గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు జయంత్ సావర్కర్ మరణించారని ఆయన కొడుకు తెలియజేశారు. జయంత్ దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు నటించారు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే ఆయన యాక్ట్ చేశారు. 66 సదాశివ్, బకాల్, వాస్తవ్, గద్బద్ గోంధాల్, సినిమాలతో పాటుగా స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ మూవీలో కూడా జయంత్ నటించారు. కాగా.. జయంత్ సావర్కర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

ఇదికూడా చదవండి: బాహుబలి-3 కన్ఫర్మ్! మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/