iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడి ఆఫీస్ లో చోరీ.. అవి దొంగలించారంటూ పోస్ట్ ! వీడియో వైరల్

  • Published Jun 21, 2024 | 9:26 AM Updated Updated Jun 21, 2024 | 9:26 AM

బాలీవుడ్ నటుడు.. అనుపమ్ ఖేర్ కు ఇండస్ట్రీ లో మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమైందంటే !

బాలీవుడ్ నటుడు.. అనుపమ్ ఖేర్ కు ఇండస్ట్రీ లో మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమైందంటే !

  • Published Jun 21, 2024 | 9:26 AMUpdated Jun 21, 2024 | 9:26 AM
ప్రముఖ నటుడి ఆఫీస్ లో చోరీ.. అవి దొంగలించారంటూ పోస్ట్ ! వీడియో వైరల్

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు హిందీతో పాటు.. తెలుగులోను అభిమానులు ఉన్నారు. అనుపమ్ ఖేర్ అనే పేరు చెప్తే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ.. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ నటించిన కార్తికేయ సినిమాలో .. లీడ్ రోల్ లో నటించిన యాక్టర్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు అలాగే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలోను ఈయన కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం ఈ రెండు సినిమాలతోనే ఈయన బాగా ఫేమస్ అయ్యారు. ఓ వైపు వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

అనుపమ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం ఏంటంటే.. అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో దొంగలు పడ్డారట. ఈ విషయాన్నీ చెబుతూ.. ఓ వీడియోను షేర్ చేశారు. “నిన్న రాత్రి ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి చొరబడ్డారు. తలుపు పగులగొట్టి లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్ దొంగిలించారు. ఈ విషయంపై మా ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీటీవీలో ఇద్దరు దొంగలు వెళ్తున్న విజువల్స్ కనిపించారు. వారికి దేవుడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పోలీసులు రాకముందే ఆఫీస్ బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు”. అంటూ అనుపమ్ ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక దీనితో ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని ఎవరో కావాలనే ఇలా చేసి ఉంటారని.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు . అలా అనుపమ్ ఖేర్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 40 ఏళ్లలో సుమారు 540 సినిమాలలో ఆయన నటించారు. అంతే కాకుండా 2004 లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అవార్డ్ లను కూడా అనుపమ ఖేర్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా అనుపమ కేర్ కు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. మరి తాజాగా సోషల్ మీడియాలో అనుపమ్ ఖేర్ షేర్ చేసిన వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet