iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీకి బంపర్‌ ఆఫర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..

  • Published Oct 23, 2023 | 9:56 PM Updated Updated Oct 23, 2023 | 9:56 PM

అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వ్యక్తికి కూడా మంచి గుర్తింపు వచ్చే పాత్రలు వస్తూ ఉంటాయి. తాజాగా, బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీని కూడా అదృష్టం వరించింది.

అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వ్యక్తికి కూడా మంచి గుర్తింపు వచ్చే పాత్రలు వస్తూ ఉంటాయి. తాజాగా, బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీని కూడా అదృష్టం వరించింది.

  • Published Oct 23, 2023 | 9:56 PMUpdated Oct 23, 2023 | 9:56 PM
బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీకి బంపర్‌ ఆఫర్‌.. ఆ స్టార్‌ హీరో సినిమాలో..

సినిమా ఇండస్ట్రీ అన్నది ఓ గాంబ్లింగ్‌ లాంటిది.. అదృష్టం ఎప్పుడు? ఎవరిని? వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. ఒక్కోసారి అదృష్టం కారణంగా జూనియర్‌ ఆర్టిస్ట్‌లు హీరోలు అయిపోతూ ఉంటారు. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వ్యక్తికి కూడా మంచి గుర్తింపు వచ్చే పాత్రలు వస్తూ ఉంటాయి. తాజాగా, బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీని కూడా అదృష్టం వరించింది. నక్క తోక తొక్కినట్లుగా.. ఓ భారీ ప్రాజెక్టులో చోటు దక్కించుకుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. సుజీత్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘‘ ఓజీ’’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ పోస్టు పెట్టింది. తన ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఆనందంగా ఉందని పేర్కొంది. పవర్‌స్టార్ ఫ్యాన్‌గా ఎంతో సంతోషం ఉందని అంది. తనలో ఉన్న టాలెంట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజీత్.. డీవీవీ మూవీస్‌కి థ్యాంక్స్ చెప్పింది. తనను ఎంకరేజ్ చేస్తూ.. ప్రేమిస్తున్న ఆడియన్స్‌కి కృతజ్ఞతలు తెలిపింది.

ఓజీ చిత్ర దర్శకుడు సుజీత్‌తో దిగిన ఓ ఫొటోను సైతం షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ఒడిస్సాకు చెందిన శుభశ్రీ రాయగురు బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోటే ఆమెను మంచి మంచి సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. మరి, శుభశ్రీకి ఓజీ సినిమాలో అవకాశం రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet