iDreamPost
android-app
ios-app

వీడియో: పబ్లిక్ లో బిగ్ బాస్ శోభా శెట్టికి చేదు అనుభవం..!

  • Published Dec 11, 2023 | 1:12 PM Updated Updated Dec 11, 2023 | 1:12 PM

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

  • Published Dec 11, 2023 | 1:12 PMUpdated Dec 11, 2023 | 1:12 PM
వీడియో: పబ్లిక్ లో బిగ్ బాస్ శోభా శెట్టికి చేదు అనుభవం..!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన ఈ రియాల్టీ షో ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా వస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చింది. ఈ సీజన్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ సాగుతూ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 5 ఇంటిసభ్యులుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఏని విచిత్రాలు 7వ సీజన్లలో కనిపిస్తున్నాయి. ట్విస్టు మీద ట్విస్టులు ఇస్తూ వారం వారవ ఆసక్తి పెంచారు. ఇప్పటికి 14వారాలు గడిచాయి.. నిన్న ఎలిమినేషన్ తో ఆరుగురు ఇంటి సభ్యులు ఫైనలిస్టులుగా మిగిలారు. వివరాల్లోకి వెళితే..

నిన్న ఆదివారం.. బిగ్ బాస్ 7వ సీజన్ లో శోభా శెట్టి జర్నీ ముగిసింది. నిన్న డేంజర్ జోన్ లోకి శివాజీ, శోభా శెట్టి వచ్చారు.. వీరిలో శోభ ఎలిమినేషన్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో 14వ వారంలో శోభా శెట్టి ఎలిమినేషన్ అయి బయటికి వెళ్లిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ మరో వారం రోజుల్లో షో ముగుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో దీప, కార్తీక్ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. విలన్ గా నటించిన మోనిత కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. ఈ సీరియలో కార్తీక్ ని దక్కించుకునేందుకు ఎన్నో రకాలు పన్నాగాలు పన్నుతుంది.. మొత్తానికి బుల్లితెరపై మోనితగా శోభా శెట్టి విలనీజం, హావభావాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఆ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 లో చోటు దక్కించుకుంది. మోనితగా కాదు.. శోభా శెట్టి అంటే ఏంటో బిగ్ బాస్ లో చూపిస్తా అంటూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి సీరియల్ బ్యాచ్ అయిన అమర్, ప్రియంక, శోభా శెట్టి ముగ్గురూ ఒకేతాటిపై నడిచారు. నామినేషన్ల సమయంలోనే కాదు.. మాములూగా కూడా ఎదటి వారిపై మాటల దాడి చేస్తూ.. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా కొనసాగింది. కొన్ని సందర్బాల్లో తీవ్ర విమర్శల పాలైంది.. వీక్ ఎండ్ లో నాగార్జున వచ్చి క్లాస్ తీసుకునేవారు.

ప్రతిసారి నామినేషన్ లీస్ట్ లో ఉన్నప్పటికీ.. ఎలిమినేట్ కాకుండా లక్కీగా సేవ్ అయ్యేది. మొత్తానికి 14 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న శోభా శెట్టి నిన్న ఎలిమినేషన్ అయ్యింది.తాజాగా శోభా శెట్టికి సంబంధించిన ఓ వీడియో లో నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో శోభా శెట్టికి చేదు అనుభవం అయినట్లు కనిపిస్తుంది. శోభా శెట్టి కారు ఓపెన్ టాప్ లో అందరికీ అభివాదం చేస్తూ.. ఊరేగింపుగా బయలుదేరింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెకు వినిపించేలా ‘మీరు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడొచ్చారు..’ అని గట్టిగా అరిచాడు. దాంతో అందరూ గట్టిగా కేకలు వేశారు. అది విన్న శోభా శెట్టి చిరు నవ్వుతో రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet