iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: హీరోగా ఎంట్రీ ఇస్తున్న పల్లవి ప్రశాంత్? డీటైల్స్ లీక్ చేసిన ఆ కంటెస్టెంట్..

  • Published Dec 27, 2023 | 8:54 AM Updated Updated Dec 27, 2023 | 8:54 AM

త్వరలోనే పల్లవి ప్రశాంత్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని తన సహచర కంటెస్టెంట్ తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

త్వరలోనే పల్లవి ప్రశాంత్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని తన సహచర కంటెస్టెంట్ తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Dec 27, 2023 | 8:54 AMUpdated Dec 27, 2023 | 8:54 AM
Pallavi Prashanth: హీరోగా ఎంట్రీ ఇస్తున్న పల్లవి ప్రశాంత్? డీటైల్స్ లీక్ చేసిన ఆ కంటెస్టెంట్..

పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సెన్సేషన్. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా టైటిల్ నే ఎగరేసుకుపోయాడు ఈ రైతు బిడ్డ. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన తొలివారంలో ప్రశాంత్ పై ఎలాంటి అంచనాలు లేవు. అందరూ అతడిని సాధారణ కంటెస్టెంట్ గానే చూశారు. కానీ పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్ టార్గెట్ చేశాక.. అతడిపై జనాల్లో సింపథీ పెరిగింది. దీంతో టైటిల్ రేసులో ఉన్న అమర్ నెగిటివ్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటకి వచ్చిన తర్వాత ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన పనికి, అతడి స్వయంకృపరాధానికి జైలుపాలైయ్యాడు. ఇక ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే? త్వరలోనే పల్లవి ప్రశాంత్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని తన సహచర కంటెస్టెంట్ తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి సెలబ్రిటీగా మారాడు పల్లవి ప్రశాంత్. హౌస్ లో మంచి ప్రవర్తనతో పాటుగా టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేస్తూ.. అందరి అంచనాలను తలకిందులు చేసి బిగ్ బాస్ టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. అయితే టైటిల్ తీసుకుని బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ కు ఊహించని షాకిచ్చారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహం వల్ల జైలుపాలైయ్యాడు ప్రశాంత్. ఇక ఇటీవలే బెయిల్ పై విడుదలైయ్యాడు పల్లవి ప్రశాంత్. ఇదిలా ఉండగా.. పల్లవి ప్రశాంత్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్, పాట బిడ్డ భోలే షావలి తెలిపాడు.

pallavi prasanth as a hero

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే షావలి ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కు సినిమా ఆఫర్స్ వచ్చాయని భోలే తెలిపాడు. ఈ విషయాన్ని అతడు బయటకి వచ్చాక చెప్పాలి అనుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. రైతు బిడ్డ హీరోగా, పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని నిర్మాతలు అడుగుతున్నారని భోలే తెలిపాడు. అయితే అది ప్రశాంత్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అతడికి ఓకే అయితే త్వరలోనే వెండితెరపై కనిపిస్తాడన్న షాకింగ్ విషయాలను వెల్లడించాడు భోలే. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి పల్లవి ప్రశాంత్ హీరోగా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş