iDreamPost
android-app
ios-app

నటి హరితేజ విడాకులంటూ వార్తలు.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్‌

  • Published Sep 30, 2023 | 11:11 AM Updated Updated Sep 30, 2023 | 11:11 AM
  • Published Sep 30, 2023 | 11:11 AMUpdated Sep 30, 2023 | 11:11 AM
నటి హరితేజ విడాకులంటూ వార్తలు.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్‌

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే.. అభిమానులు మాత్రమే కాదు.. సామాన్యులు కూడా ఆసక్తి కనబరుస్తారు. సెలబ్రిటీలకు సంబంధించి కేవలం సినిమాలకు మాత్రమే కాక.. వారి వ్యక్తిగత విషయాలు, కుటుంబం, ప్రేమ, పెళ్లి వంటి వార్తలంటే.. అందరిలో ఆసక్తి ఉంటుంది. ఇక సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం చాలా వరకు తగ్గింది. ఇది ఒకవైపు మాత్రమే.. మరోవైపు.. సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు వార్తలు కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా నటి హరితేజకు సంబంధించి ఇలానే తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయి. ఆమె భర్త నుంచి విడిపోయింది అంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిపై నటి హరితేజ కాస్త ఘాటుగానే స్పందించింది.

హరితేజ ఇటు బుల్లితెర మీదనే కాక.. వెండి తెర మీద తనదైన ముద్ర వేసింది. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది హరితేజ. బిగ్‌బాస్‌ సీజన్‌1లో టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా హరితేజ భర్త నుంచి విడాకులు తీసుకుంది అంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేసింది హరితేజ.

ప్రస్తుతం హరితేజ.. ఆస్ట్రేలియా వెళ్లింది. కుమార్తెను తన తల్లి దగ్గర వదిలి వెళ్లి.. ఒక్కతే ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అభిమానులతో చిట్‌ చాట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. మీరు మీ భర్త దీపక్‌ నుంచి విడిపోయారా అని ప్రశ్నించాడు. అందుకు హరితేజ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. నాలుగు రోజులు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా లేకపోతే.. మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్‌ చేసింది. దాంతో విడాకులు రూమర్స్‌కి చెక్‌ పెట్టింది హరితేజ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక మరో నెటిజన్‌.. మీరు సీరియల్‌ నటి నవ్యతో విడిపోయారా అని ప్రశ్నించాడు. అందుకు హరితేజ బదులిస్తూ.. అలా జరగదమ్మా.. అంటూ తమ మధ్య ఉన్న స్నేహం ఎంత బలమైందో చెప్పకనే చెప్పింది. ఇక హరితేజకు 2015లో దీపక్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అతడు కన్నడ వ్యక్తి. ఇక వీరిద్దరికి 2021లో కుమార్తె జన్మించింది. పాపకు భూమి అని పేరు పెట్టుకుంది హరితేజ.

 

View this post on Instagram

 

A post shared by Nithya Suresh (@nithya_hari)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap