iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

  • Published Nov 07, 2023 | 9:05 AM Updated Updated Nov 07, 2023 | 9:05 AM

బిగ్‌బాస్‌ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా వర్మ. గతంలో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్‌ ద్వారా వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

బిగ్‌బాస్‌ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా వర్మ. గతంలో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్‌ ద్వారా వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Nov 07, 2023 | 9:05 AMUpdated Nov 07, 2023 | 9:05 AM
బిగ్‌బాస్‌ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

బిగ్‌బాస్‌కు రాకముందు శ్వేతా వర్మ గురించి జనాలకు పెద్దగా తెలియదు. బిగ్‌బాస్‌ కన్నా ముందు ఆమె రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా అంటూ ఇలా అనేక సినిమాల్లో హీరోయిన్‌, ఇతర పాత్రల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో శ్వేతా వర్మ, ఆనీ మాస్టర్ల రిలేషన్, గొడవలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. హౌజ్‌లో వీరిద్దరూ తల్లీకూతుళ్లలా ఎంతో దగ్గరయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో తన బిహేవియర్‌తో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్వేతా వర్మ. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు.. టఫ్‌ కంటెస్టెంట్‌గా రాణించింది.

ఇక బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చాక.. కొందరికి విపరీతంగా అవకాశాలు వస్తాయి. వారి కెరీర్‌ మలుపు తిరుగుతుంది. కానీ శ్వేతా వర్మ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇటు బుల్లితెరపై గానీ అటు వెండితెరపై గానీ శ్వేతా వర్మ ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా శ్వేతావర్మ.. తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందంటూ పోస్ట్‌ చేసింది. ఓ గది మొత్తం తగలబడిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అగ్ని ప్రమాదం గురించి పోస్ట్‌ చేసింది శ్వేతా వర్మ.

‘మా ఇంట్లో​ ఓ భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని చూశాను. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని వల్ల ఓ గది మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో మేం ఎవ్వరం గాయపడలేదు. నా కుటుంబ సభ్యులు, పెట్స్‌ అందరం క్షేమంగా ఉన్నాము. కానీ ఈ భయంకరమైన ఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉంది.. నా కోసం మీరు ప్రార్థించండి.. మేం అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం.. కొన్ని రోజుల తరువాత మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసుకొచ్చింది శ్వేతా వర్మ. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆమె ఫ్యాన్స్‌ ధైర్యం చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Swetaa Varma (@swetaavarma)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet