iDreamPost
android-app
ios-app

నూతన ఇంటి గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి! ఫోటోలు వైరల్

  • Published Apr 30, 2024 | 1:04 PM Updated Updated Apr 30, 2024 | 1:04 PM

Shobha Setty Entered The New House: బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి ప్రతి వారం ఎదో ఒక కాంట్రవర్సీ చేస్తూ నెగిటీవ్ టాక్ తెచ్చుకొని బయటికి వచ్చింది.

Shobha Setty Entered The New House: బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి ప్రతి వారం ఎదో ఒక కాంట్రవర్సీ చేస్తూ నెగిటీవ్ టాక్ తెచ్చుకొని బయటికి వచ్చింది.

  • Published Apr 30, 2024 | 1:04 PMUpdated Apr 30, 2024 | 1:04 PM
నూతన ఇంటి గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి! ఫోటోలు వైరల్

ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. వాటిలో కొన్నిసీరియల్స్ కే మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటి సీరియల్స్ లో ఒకటి కార్తీక దీపం. ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సిరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ ‘కార్తీక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత స్టార్ మా రియాలిటీ లో కనిపించింది.తెలుగులో వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో శోభా శెట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షోలో నెగిటీవిటీ తో బయటికి వచ్చింది. తాజాగా శోభాశెట్టి కొత్తగా ఇళ్లు కొని నూతన గృహ ప్రవేశం చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన ‘కార్తీక దీపం’ డైలీ సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది శోభా శెట్టి. ఈ సీరియల్ లో శోభాశెట్టి విలన్ తన విశ్వరూపాన్ని చూపించింది. కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన శోభా శెట్టి తర్వాత స్టార్ మా రియాల్టీ షో, బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు శోభా శెట్టి తనకు సొంత ఇంటి కల గురించి చెప్పింది. అలాగే తన ప్రేమ వ్యవహారాన్ని కూడా బయటపెట్టింది. మొత్తానికి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిజీగా ఉన్న శోభా శెట్టి ఇటీవల తన ప్రియుడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

తన సహ నటుడు అయిన యశ్వంత్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉ్న శోభా శెట్టి బిగ్ బాస్ లో తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. వీరిద్దరూ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. తాజాగా శోభా శెట్టి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తన సొంత ఇంటి కల ఇప్పుడు సాకారమైంది.ఈ క్రమంలోనే నూతన గృహ ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శోభా శెట్టి పలు సీరియల్స్ లో నటిస్తుంది. దాంతో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabet