iDreamPost
android-app
ios-app

నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

  • Author Soma Sekhar Published - 06:14 PM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 06:14 PM, Wed - 21 June 23
నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

బుల్లితెర నటి, బిగ్ బాస్ బ్యూటీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో ఈ జంటకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటుగా బంధువులు, స్నేహితులు శుభాకాంక్షల తెలుపుతున్నారు. అయితే నెలలు నిండకుండానే ఈ నటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అతడు తెలిపాడు.

దీపికా కక్కర్.. బుల్లితెరపై తనదైన నటనతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ లో సోనాక్షి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొని విజేతగా నిలిచింది. దాంతో ఒక్కసారిగా దీపికా పాపులర్ అయ్యారు. అలాగే నాచ్ బలియే 8 అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది దీపిక.

ఇక తాజాగా దీపిక కక్కర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నెలలు నిండకుండానే బిడ్డ జన్మిచ్చాడని, కానీ తల్లి, బిడ్డ సురక్షితంగానే ఉన్నారని అతడు చెప్పుకొచ్చాడు. 2018లో షోయబ్ ను పెళ్లాడింది దీపిక. ఇది ఆమెకు రెండో పెళ్లి కాగా.. రౌనక్ సామ్సన్ అనే వ్యక్తిని మెుదటి పెళ్లి చేసుకుంది. కానీ 2015లో వీరిద్దరు అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.

Bollywood bigg boss beauty dipika kakar become a mother