iDreamPost
android-app
ios-app

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తుపట్టలేని విధంగా..

  • Published Jun 03, 2024 | 4:38 PM Updated Updated Jun 03, 2024 | 4:38 PM

Bigg Boss Beauty Health Issue: సినిమా వాళ్ళు తెర మీద నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ పెట్టినా అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. సమంత, ఫహద్ ఫాజిల్ వంటి వాళ్ళు అరుదైన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నటి తన అనారోగ్య సమస్య గురించి బయటపెట్టింది.

Bigg Boss Beauty Health Issue: సినిమా వాళ్ళు తెర మీద నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ పెట్టినా అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. సమంత, ఫహద్ ఫాజిల్ వంటి వాళ్ళు అరుదైన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నటి తన అనారోగ్య సమస్య గురించి బయటపెట్టింది.

  • Published Jun 03, 2024 | 4:38 PMUpdated Jun 03, 2024 | 4:38 PM
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తుపట్టలేని విధంగా..

సినీ రంగానికి చెందిన పలువురు హీరోయిన్లు సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేసినట్టే.. నిజ జీవితంలో కూడా సవాళ్ళను ఎదుర్కునే పరిస్థితి కలుగుతుంది. కోట్లు సంపాదిస్తున్నా గానీ ఆరోగ్యం విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతోంది. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వంటి హీరోయిన్లు సైతం క్యాన్సర్ ని జయించి నిలబడ్డారు. ఇటీవల పుష్ప 2 విలన్ ఫహాద్ ఫాజిల్ సైతం అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని వెల్లడించారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి తనకున్న అనారోగ్య సమస్యను బయటపెట్టింది. 

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్. చిత్ర, విచిత్రమైన డ్రెస్సులతో సోషల్ మీడియా అటెన్షన్ ని డ్రా చేసే ఉర్ఫీ.. తాజాగా తన అనారోగ్య సమస్యను బయటపెట్టింది. ఈమె ప్రస్తుతం స్ప్లిట్స్ విల్లా ఎక్స్5 షోలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఉండగా ఆమెకు చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. చర్మ సమస్యలతో బాధపడుతున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. మొఖం ఉబ్బిపోయి, కళ్ళు వాచిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోయింది. తన మొఖం మీద అనేక రిమార్కులు పొందుతున్నానని.. తనకు అలర్జీ ఉందని.. చాలా సార్లు తన ముఖం ఉబ్బిపోతుంటుందని ఆమె తెలిపింది.

Bigg Boss beauty suffering from health problem 02

ప్రతి రెండో రోజు తాను ఉబ్బిన మొఖంతో లేస్తానని.. మొఖం ఉబ్బిపోయి, కళ్ళు వాచిపోయి ఉంటాయని ఆమె వెల్లడించింది. తాను ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటానని ఆమె తెలిపింది. ఇవి ఫిల్లర్స్ కాదని.. అలర్జీ అని ఆమె తెలిపింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇమ్యునోథెరపీ తీసుకుంటున్నానని ఆమె తెలిపింది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ సమస్యను ఎదుర్కుంటున్నానని.. దీని కంటే పెద్ద సమస్య అయితే రాలేదని ఆమె వెల్లడించింది. మీరు కనుక ఉబ్బిన ముఖాన్ని చూసినట్లయితే అనవసర సలహాలు ఇవ్వకండి.. సింపతి చూపించకండి అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom