iDreamPost
android-app
ios-app

హీరోగా బిగ్ బాస్ అమర్.. జోడీగా సురేఖా వాణి కుమార్తె!

  • Published Feb 01, 2024 | 2:56 PM Updated Updated Feb 01, 2024 | 3:10 PM

Amardeep- Supritha Movie: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఇందులో హీరోయిన్ గా సీనియర్ నటి కుమార్తె సుప్రీత నటిస్తోంది.

Amardeep- Supritha Movie: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఇందులో హీరోయిన్ గా సీనియర్ నటి కుమార్తె సుప్రీత నటిస్తోంది.

  • Published Feb 01, 2024 | 2:56 PMUpdated Feb 01, 2024 | 3:10 PM
హీరోగా బిగ్ బాస్ అమర్.. జోడీగా సురేఖా వాణి కుమార్తె!

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న వారి లైఫ్ కచ్చితంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ పరంగా కూడా వారికి మంచి అవకాశాలు చాలానే వస్తాయి. ఆ విషయం మరోసారి అమర్ దీప్ విషయంలో రుజువవుతోంది. ఇప్పటికే అమర్ కు రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో అమర్ దీప్ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ, ఇప్పుడు అమర్ దీప్ కు హీరోగా మరో ఛాన్స్ వచ్చేసింది. ఆ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ గా సీనియర్ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత నటిస్తోంది.

బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా అమర్ దీప్ హీరోగా సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరోయిన్ సెలక్షన్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంది. అమర్ కి జోడీగా సీనియర్ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీతాని సెలక్ట్ చేశారు. ఇప్పటికే అమర్ దీప్ ఐరావతం అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి మెప్పించాడు. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవీంద్రలాంటి వాళ్లు కీ రోల్స్ ప్లే చేయబోతున్నారు. ఇంక ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ గురించి కూడా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.

సురేఖా వాణి కుమార్తె సుప్రీత వెండితెర ఎంట్రీ ఇవ్వకుండానే నెట్టింట భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. తల్లి సురేఖా వాణితో కలిసి చేసే అల్లరికి సోషల్ మీడియాలో చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. నిజానికి హీరోయిన్ సుప్రీత ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సింది. ఆమె డెబ్యూకి సంబంధించి చాలానే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అధికారికంగా సినిమాకి సంబంధించి ప్రకటన చేశారు. సినిమా టైటిల్, కథ ఏ జానర్ లో ఉండబోతోంది వంటి ఆసక్తికర విషయాలు ఇంకా బయటకు రాలేదు. మరి.. అమర్ దీప్- సుప్రీత హీరో హీరోయిన్ గా మూవీ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Revanth Chowdary (@_revanth_chowdhary_)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio