iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో అమ్మాయి.. యాంకర్, సింగర్, యూట్యూబర్ మాత్రమే యాక్టర్ కూడా

  • Published Sep 09, 2024 | 6:46 PM Updated Updated Sep 09, 2024 | 6:46 PM

ఈ ఫోటోలో అమ్మాయి.. సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్, యూట్యూబర్ మాత్రమే కాదు యాక్టర్ కూడా. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె మల్టీటాలెంటర్. బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో అమ్మాయి.. సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్, యూట్యూబర్ మాత్రమే కాదు యాక్టర్ కూడా. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె మల్టీటాలెంటర్. బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 09, 2024 | 6:46 PMUpdated Sep 09, 2024 | 6:46 PM
ఈ ఫోటోలో అమ్మాయి.. యాంకర్, సింగర్, యూట్యూబర్ మాత్రమే యాక్టర్ కూడా

ఈ ఫోటోలో చక్కనైన మోముతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్, యూట్యూబర్, యాక్టర్, యాంకర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఇటీవల బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. మరింత చేరువ కావాల్సిన సమయంలో దూరమైంది. ఇంతకు ఈ యువతి ఎవరంటే.. మధు అలియాస్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన ఆమె.. ఫస్ట్ వీక్‌లో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఉన్నంత సేపు తన ఆట, మాట తీరుతో ఆకట్టుకున్న బేబక్క చిన్నప్పటి ఫోటోనే అది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. కరోనా సమయంలో ఫన్నీ వీడియోలు చేస్తూ నెటిజన్లకు చేరువైంది. ‘జాకెట్ ముక్క వీడియో’‌తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఈ వీడియో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది.

బెజవాడ బేబక్క అసలు పేరు మాధవి నెక్కంటి. ఆమెది విజయవాడ అయినప్పటికీ.. ఆమె చాన్నాళ్ల పాటు అమెరికాలో ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేస్తూనే అక్కడ పలు షోస్ చేసింది. అలాగే క్లాత్ బ్రాండింగ్ చేసేది. యాంకరింగ్, స్టాండప్ కమెడియన్, సింగర్‌గా కొనసాగుతుంది. ఇప్పుడు ఇండియా.. అమెరికా రెండు చోట్ల రోలర్ కోస్టర్‌లా ప్రయాణిస్తూనే ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆమె పాప్ సింగర్ కూడా. పలు పాప్ సాంగ్స్ చేసింది. ఇదే కాదు ఆమె పలు చిత్రాల్లో నటించింది. ఆమెకు ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆమెకు స్వయానా పెద్ద నాన్న అవుతారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది బేబక్క. ఆలీ, ఎంఎస్ రాజు, మాధవీలతతో మంచి ర్యాపో ఉంది ఆమెకు.

Big Boss 8 Contestant Bezawada Bebakka 1

ఇండియలో కూడా సింగర్ మధు పేరుతో పలు షోస్ చేస్తూనే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తుంది బేబక్క. మధు అలియాస్ బెజవాడ బేబక్క మల్టీ టాలెంటర్. సింగర్, స్టాండప్ కమెడియన్, యాంకర్ మాత్రమే కాదు నటి కూడా. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, 24 కిసెస్, మళ్లీ పెళ్లి వంటి దాదాపు 20 సినిమాల వరకు చేసింది. మళ్లీ పెళ్లిలో ఆమె క్లిక్ అయ్యింది. ఆమె శ్రీకాంత్ సరనస హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ “షూట్‌-అవుట్‌ ఎట్‌ అలేర్‌” సినిమాలో శ్రీకాంత్‌ భార్యగా నటించింది.. అందులో కూడా బాగానే రిజిస్టర్ అయ్యింది. అంతేకాదు బేబక్క సేవా కార్యక్రమాలు చేస్తుంది. బేబక్క ఫౌండేషన్ పేరుతో పాఠశాలలకు టీవీల పంపిణీ కూడా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet