iDreamPost
android-app
ios-app

ఆఫర్ల కోసమే లిప్ ఫిల్లర్ చేయించా.. ఇక పెళ్లి చేసుకోను: శ్రీ సత్య

  • Published Jul 14, 2024 | 1:00 AM Updated Updated Jul 14, 2024 | 1:00 AM

మోడల్ నుండి నటిగా మారింది ఒకప్పటి మిస్ విజయవాడ శ్రీ సత్య. సీరియల్స్, షార్ట్ ఫిల్మ్ చేయని గుర్తింపు.. బిగ్ బాస్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6లో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని

మోడల్ నుండి నటిగా మారింది ఒకప్పటి మిస్ విజయవాడ శ్రీ సత్య. సీరియల్స్, షార్ట్ ఫిల్మ్ చేయని గుర్తింపు.. బిగ్ బాస్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6లో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని

  • Published Jul 14, 2024 | 1:00 AMUpdated Jul 14, 2024 | 1:00 AM
ఆఫర్ల కోసమే లిప్ ఫిల్లర్ చేయించా.. ఇక పెళ్లి చేసుకోను: శ్రీ సత్య

హీరోయిన్ అవుదామని వచ్చి.. బుల్లితెరపై రాణిస్తున్న నటి శ్రీ సత్య. మిస్ విజయవాడ, మిస్ ఆంధ్ర నుండి మోడల్ రంగంలో అడుగుపెట్టింది. తర్వాత సినిమాల్లో స్మాల్ రోల్స్ చేసింది. నేను శైలజలో సినిమాలో రామ్‌కు లవర్‌గా చేసింది. గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ అనే చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో బుల్లితెరపై సందడి చేసింది. ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌తో పాటు కొన్ని షార్ట్ ఫిల్మ్‌ చేసింది. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది మాత్రం బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 6లో వచ్చి సందడి చేసింది. అర్జున్ కళ్యాణ్‌తో సన్నిహితంగా మెలిగింది. సుమారు 103 రోజుల పాటు ఇంట్లో గడిపింది శ్రీ సత్య. బయటకు వచ్చాక పలు డ్యాన్స్ షోస్ చేసింది.

అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మొహబూబ్‌తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజే టిల్లు2లో కూడా ఓ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్ షోలో కంటెస్టెంట్లకు లీడర్ గా వ్యవహరిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించింది. ‘నేను బిగ్ స్క్రీన్ చూసుకుందామని వచ్చాను. అది నా డ్రీమ్. ఆ అదృష్టం ఇంకా రాలేదు. చేస్తున్నాను కొన్ని వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒప్పుకున్నవీ లేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంత హార్డ్ వర్క్ చేసినా.. లక్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్. డీజే టిల్లు 2 సినిమాలో షూటింగ్ చేశా. కానీ మూవీ వచ్చేసరికి కాసేపే కనిపించా. సినిమా లెంత్త్ ఎక్కువ అవ్వడం వల్ల నేను నటించిన పార్ట్ కట్ చేశారు’ అని చెప్పుకొచ్చింది.

సీరియల్స్ ఆపేయడంపై మాట్లాడుతూ.. ‘సీరియల్స్ చేస్తుంది అని, చాలా సినిమా ఆఫర్లు పోయాయి. నాకు ఆఫర్లు పోవడానికి కారణం టెలివిజన్ ఇండస్ట్రీనే. కొన్ని సినిమాలైతే దారుణం. కావాలని పిలిపించుకొని.. నువ్వు తెల్లగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, హీరోయిన్ లా కనిపించట్లేదు అన్నారు. నన్ను తీసేసి.. మళ్లీ టెలివిజన్ హీరోయిన్‌నే తీసుకున్నారు. తెలుగు అమ్మాయి అనే సరికి రిజక్ట్ చేశారు. బయట ఒకలా, లోపల మరోలా ఉండలేను’ అని చెప్పింది. అలాగే తనపై చెత్త కామెంట్స్ చేస్తున్నారని, ఏ వ్యక్తితో అయినా డ్యాన్స్ చేస్తే చాలు మా మధ్య ఏదో ఉందని కామెంట్స్ పెడుతున్నారని, దయచేసి పర్సనల్‌ లైఫ్‌ను, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను కలిపి చూడొద్దని పేర్కొంది. అలాగే  తాను లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నానని తెలిపింది. తన లిప్స్ చిన్నగా ఉన్నాయని,  చిన్న పిల్ల ఫేస్ లా కనిపిస్తుందని చాలా మంది ఆఫర్స్ ఇవ్వట్లేదు. దీంతో ఏదో ఒకటి చేయాలని లిప్ ఫిల్లర్ చేయించానని తెలిపింది. ఇది మూడునాలుగు నెలలు మాత్రమే ఉంటుందని చెప్పింది శ్రీ సత్య. ఇక పెళ్లి చేసుకోనని చెప్పింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş