iDreamPost
android-app
ios-app

త్రిషకు భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌.. ఏకంగా అన్ని కోట్లు..

  • Published Sep 16, 2023 | 8:50 PM Updated Updated Sep 16, 2023 | 8:50 PM
  • Published Sep 16, 2023 | 8:50 PMUpdated Sep 16, 2023 | 8:50 PM
త్రిషకు భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌.. ఏకంగా అన్ని కోట్లు..

త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటినా.. హీరోయిన్‌గా మాత్రం ఆమెకు అవకాశాలు తగ్గటం లేదు. పైపెచ్చు భారీ రెమ్యూనరేషన్‌తో కూడిన ఆఫర్లు వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా, ఆమెకు ఓ భారీ ప్రాజెక్టులో ఆఫర్‌ వచ్చింది. ఆ భారీ ప్రాజెక్టులో నటించేందుకు నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్‌ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారట. ఆ సినిమా ఏదో కాదు.. లోక నాయకుడు కమల్‌ హాసన్‌.. ప్రముఖ దర్శకుడు మణిరత్నంల కాంబోలో రాబోతున్న సినిమా.

ఈ సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌గా ‘‘ కేహెచ్‌ 234’’ అని పేరు పెట్టారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో శింబు కూడా నటిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం త్రిషను హీరోయిన్‌గా తీసుకోవటానికి నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాలో నటించమంటూ త్రిషకు భారీ ఆఫర్‌ ఇచ్చారట. ఏకంగా 12 కోట్ల రూపాయలు ఇవ్వజూపుతున్నారట. త్రిష ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటే ఆమె పేరిట రికార్డ్‌ క్రియేట్‌ కానుంది.

ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లు ఎవరూ ఇంత పెద్ద మొత్తం తీసుకోలేదు. ఈ ఆఫర్‌ ఓకే అయితే త్రిష ఆ రికార్డును ఆచీవ్‌ చేసిన వారు అవుతారు. కాగా, కమల్‌-మణిరత్నం కాంబోలో రాబోతున్న.. అది కూడా దాదాపు 30 ఏళ్ల తర్వాత రాబోతున్న సినిమా కావటంతో ‘కేహెచ్‌ 234’పై భారీ అంచనాలు ఉన్నాయి. శింబూ కూడా నటిస్తుండటంతో సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. మరి,  ‘‘ కేహెచ్‌ 234’’ సినిమా కోసం త్రిషకు ఏకంగా 12 కోట్ల రూపాయలు ఆఫర్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş