iDreamPost
android-app
ios-app

వీడియో: నేహా చౌదరికి ప్రమాదం.. మెడకు బెల్ట్‌తోనే స్టేజ్ మీదకు!

  • Published Apr 25, 2024 | 9:28 PM Updated Updated Apr 25, 2024 | 9:28 PM

బుల్లితెరపై రాణించిన యాంకరమ్మలో నేహా చౌదరి ఒకటి. ఈ పొడుగు కాళ్ల సుందరి.. బిగ్ బాస్ లో కూడా మెప్పించింది. ఇప్పుడు డ్యాన్స్ రియాలిటీ షో నీతోనే డ్యాన్స్ 2.0లో కూడా అలరిస్తుంది. అయితే ఆమెకు

బుల్లితెరపై రాణించిన యాంకరమ్మలో నేహా చౌదరి ఒకటి. ఈ పొడుగు కాళ్ల సుందరి.. బిగ్ బాస్ లో కూడా మెప్పించింది. ఇప్పుడు డ్యాన్స్ రియాలిటీ షో నీతోనే డ్యాన్స్ 2.0లో కూడా అలరిస్తుంది. అయితే ఆమెకు

  • Published Apr 25, 2024 | 9:28 PMUpdated Apr 25, 2024 | 9:28 PM
వీడియో: నేహా చౌదరికి ప్రమాదం.. మెడకు బెల్ట్‌తోనే స్టేజ్ మీదకు!

స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షో నీతోనే డ్యాన్స్. ఇప్పుడు సీజన్ 2 కూడా నడుస్తోంది. బిగ్ బాస్‌లో అలరించిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడ తమ జోడీలతో ఫెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రాధ, సదాలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తమదైన మాటలతో ఆ షోకే అందాన్ని తెచ్చారు ఈ భామలు. ఇక శ్రీముఖి తన యాంకరింగ్‌తో కట్టిపడేస్తోంది. ఈ షోపై పలు విమర్శలు ఎదురౌతున్నప్పటికీ.. సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. మానస్-శుభశ్రీ రాయగురు, విశ్వ-నేహా, దర్శన గౌడ-పృథ్వీ శెట్టి, నయని పావని-ప్రిన్స్ యావర్, బాల ఆదిత్య-పూజా మూర్తి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హరిక ఇలా పలు జంటలు తమ డ్యాన్సులతో అలరిస్తున్నాయి.

అయితే తాజాగా నెక్ట్స్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు పేర్కొంది శ్రీముఖి. పలు జంటలు తమ డ్యాన్స్ తో అలరించాయి. అలాగే మార్కులు తక్కువ ఇవ్వడం, దానిపై ఇతర కంటెస్టెంట్ చిరాకు పడటం కనిపించాయి. అదే సమయంలో విశ్వ-నేహాల జంట వచ్చింది. కన్నీరు పెట్టుకుంటూ స్టేజీపైకి వచ్చింది నేహా. ఆమె వెంట విశ్వ కూడా ఉన్నాడు. ఇందులో నేహా మెడకు గాయం అయినట్లు కనిపిస్తోంది. అంతలో సదా ఏమైంది అని ప్రశ్నించగా.. ‘నేను ఇలా ఎంట్రీ ఇస్తానని ఎప్పుడు అనుకోలేదు’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది నేహా. దీంతో ఆమెకు గాయమైనట్లు తెలుస్తోంది. మరీ ఆ షోలో ఆమె కనిపిస్తుందో లేదో ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

తిరుపతిలో పుట్టిన నేహా చౌదరి 2012 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. యాంకర్‌గా అడుగుపెట్టి పాపులర్ అయ్యింది . 2020-2021లో జరిగిన ఐపీఎల్ కు స్టార్ స్పోర్ట్ తెలుగులో యాంకరింగ్ చేసి పాపులర్ అయ్యింది నేహా. పలు మ్యాచులకు ప్రజెంటర్‌గా కూడా వ్యవహరించింది. ఆమె డ్యాన్సర్, మోడల్ కూడా. బిగ్ బాస్ సీజన్ తెలుగు ఆరో సీజన్‌లో అలరించింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్ ను మనువాడింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజే పెళ్లి పీటలు ఎక్కింది.  సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పలకిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీతోనే డ్యాన్స్ 2.0లో విశ్వతో కలిసి డ్యాన్స్ చేస్తోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio