iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకపై కేసు నమోదు..?

  • Published Nov 26, 2024 | 4:31 PM Updated Updated Nov 26, 2024 | 4:31 PM

Big Boss priyanka: తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంది. రీసెంట్ గా ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే అలిపిరి నడక మార్గమైన.. చిరుత సంచరించే మార్గం ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు ఈ జంట.

Big Boss priyanka: తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంది. రీసెంట్ గా ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే అలిపిరి నడక మార్గమైన.. చిరుత సంచరించే మార్గం ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు ఈ జంట.

  • Published Nov 26, 2024 | 4:31 PMUpdated Nov 26, 2024 | 4:31 PM
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకపై కేసు నమోదు..?

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఏది పడితే అది చేస్తున్నారు. వాటిలో ఈ మధ్య ప్రాంక్ వీడియోలు బాగా పెరిగిపోయాయి. వాటికీ లైక్స్ , షేర్స్ , కామెంట్స్ బాగా రావడంతో అందరు ఇదే ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అవ్వడంలో.. ఫేమస్ అవ్వాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ అవి దేనికి సంబంధించి చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా తెలీకుండా.. కనీసం ఆలోచించకుండా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. అలాంటి వారిపై కొంత యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంది. రీసెంట్ గా ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే అలిపిరి నడక మార్గమైన.. చిరుత సంచరించే మార్గం ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు ఈ జంట.

చిరుత గాండ్రింపును రీల్స్‌లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చూస్తే అక్కడ చిరుత లేదు ఏమి లేదు అంతా తూచ్ అంటూ ప్రాంక్ చేశారు. గతంలో అదే ప్రదేశంలో నిజంగానే ఒక చిరుత కారణంగా ఒక చిన్నారి బలి అయింది. అలాంటి విషయం మీదే ఇలాంటి ప్రాంక్స్ చేయడంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమలలో భక్తి భావం లేకుండా.. ఈ రకంగా ఫేమస్ అవ్వడం కోసం రీల్స్ చేయడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు ఇదే విధంగా ప్రాంక్ చేయడంతో.. వారిపైన కేసులు నమోదు చేసింది టిటిడి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రియాంకపైన కూడా టీటీడి యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు భక్తులు.

నెటిజన్లతో పాటు ఘటనపై టిటిడి కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రియాంకపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం భక్తుల మనోభావాలతో ఆదుకోవడం అసలు కరెక్ట్ కాదని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు అయితే ప్రియాంక కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ కానీ స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఇలాంటి ప్రాంక్ వీడియో షూట్ చేసినందుకు అంతా వీరిపై మండిపడుతున్నారు. ఇక ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఈ మధ్య సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. సెలెబ్రిటీలు సైతం ముందు వెనుక ఆలోచించకుండా రీల్స్ మోజులో పడిపోతున్నారు. ఫేమస్ మాట అటు ఉంచితే.. ఇలా అనుకోని ఉచ్చులో చిక్కుకుని ఉన్న పేరును కూడా పోగొట్టుకునే స్టేజ్ కు వచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక మ్యాటర్ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet