iDreamPost
android-app
ios-app

జిమ్ లో అర్జున్ అంబటి కసరత్తులు.. ఇదంతా RC16 కోసమేనా!

  • Published Apr 11, 2024 | 4:55 PM Updated Updated Apr 11, 2024 | 4:55 PM

అర్జున్ అంబటి.. బిగ్ బాస్ సీజన్ 7 తో ఇతను అందరికి సుపరిచితుడయ్యాడు. సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ లేటెస్ట్ గా జిమ్ లో కష్టపడుతూ కండలు పెంచుతున్నాడు. ఇదంతా RC16 కోసమేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ నిజంగానే RC16 లో ఛాన్స్ కొట్టేశాడా .. చూద్దాం.

అర్జున్ అంబటి.. బిగ్ బాస్ సీజన్ 7 తో ఇతను అందరికి సుపరిచితుడయ్యాడు. సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ లేటెస్ట్ గా జిమ్ లో కష్టపడుతూ కండలు పెంచుతున్నాడు. ఇదంతా RC16 కోసమేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ నిజంగానే RC16 లో ఛాన్స్ కొట్టేశాడా .. చూద్దాం.

  • Published Apr 11, 2024 | 4:55 PMUpdated Apr 11, 2024 | 4:55 PM
జిమ్ లో అర్జున్ అంబటి కసరత్తులు.. ఇదంతా RC16 కోసమేనా!

బిగ్ బాస్ సీజన్స్ లో ఎంత మంది కంటెస్టెంట్స్ వచ్చినా కానీ.. వారందరిలో చాలా తక్కువ మంది మాత్రమే మంచి పేరు సంపాదించుకుంటారు. ఒక్క ఎంటెర్టైనేమేంట్ కాకుండా కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాకుండా వీటి అన్నింటిని సమానంగా బాలన్స్ చేస్తూ మెచ్యూర్డ్ గా ఆలోచించేవారు మాత్రమే మంచి పేరుతో అందరికి గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకడు బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి. వచ్చిన మొదటి రోజు నుంచే అన్ని రకాలుగా పర్ఫెక్ట్ పర్సన్ అనిపించుకున్నాడు అర్జున్. ఇక గ్రాండ్ ఫినాలే లో ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుని.. ప్రేక్షకుల మదిలో మాత్రం విన్నర్ గానే నిలిచిపోయాడు. అయితే బిగ్ బాస్ కు వాచీని ఎవరికైనా కూడా ఎదో ఒక మంచి సినీ అవకాశం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ క్రమంలోనే అర్జున్ కు కూడా పెద్ద ఆఫర్ వచ్చింది. ఇక రీసెంట్ గా అర్జున్ జిమ్ లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో అందరికి రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి.

అర్జున్ కు తగిలిన బంపర్ ఆఫర్ ఏంటంటే.. గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. బిగ్ బాస్ స్టేజ్ పైన.. అర్జున్ కు ఒక ఆఫర్ ఇచ్చారు. “నువ్వు బయటికి రాగానే రామ్ చరణ్ గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నావ్. నీ కోసం ఓ మంచి పాత్ర సిద్ధంగా ఉంది” అంటూ అన్నారు బుచ్చిబాబు. దీనితో అర్జున్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అది కంప్లీట్ అయినా వెంటనే డైరెక్టర్ బుచ్చి బాబుతో కలిసి RC16 ను స్టార్ చేయనున్నాడనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. మరి RC16 లో రామ్ చరణ్ తో కలిసి నటించడం అంటే చాలా పెద్ద అవకాశం అని చెప్పి తీరాలి. అయితే ఈ క్రమంలో అర్జున్ తాజాగా జిమ్ చేస్తున్న వీడియోను ఒకటి పోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు అర్జున్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదంతా RC16 కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే అర్జున్ కెరీర్ లో ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పి తీరాలి.

ఇప్పుడు రామ్ చరణ్ కు బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లెవెల్ వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ తో ఎలాంటి హైప్ క్రియేట్ చేయనున్నాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం.. అర్జున్ కెరీర్ లో ఇది బెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక అర్జున్ విషయానికొస్తే అగ్ని సాక్షి సీరియల్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సీరియల్ అర్జున్ కు ఊహించిన స్టార్ డమ్ తెచ్చిపెట్టిందని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత పలు సీరియల్స్ లో అర్జున్ నటించాడు. అటు సీరియల్స్ తో పాటు.. ‘అర్ధనారి’ అనే సినిమాలో కూడా అర్జున్ నటించాడు. వీటితో పాటు అప్పుడప్పుడు అర్జున్ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ , ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు. మరి RC16 కోసం అర్జున్ రెడీ అవుతున్నాడని నెటిజన్స్ అంటున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet