iDreamPost
android-app
ios-app

బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు బుల్లితెర సెన్సేషన్

  • Published Aug 02, 2024 | 6:55 PM Updated Updated Aug 02, 2024 | 6:58 PM

Pic Talk: పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ఏదో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ కుర్రాడు యాక్టర్ గా మారి పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లో, సీరియల్స్ లో హీరోగా అలరిస్తున్నాడు. పైగా ఈ హీరోకు ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ఏదో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ కుర్రాడు యాక్టర్ గా మారి పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లో, సీరియల్స్ లో హీరోగా అలరిస్తున్నాడు. పైగా ఈ హీరోకు ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 02, 2024 | 6:55 PMUpdated Aug 02, 2024 | 6:58 PM
బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు బుల్లితెర సెన్సేషన్

సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుల హవా ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఎందుకంటే.. నేడు బల్లితెర దగ్గర నుంచి వెండితెర వరకు ఏలుతున్నా యాక్టర్స్ లో వాల్లే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా.. ఒకప్పుడు బాలనటులుగా పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన నటీ, నటులు నేడు వెండితెర పై హీరో, హీరోయన్లుగా ఎంట్రీ ఇస్తూ.. మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా.. పలు సినిమాల్లో అలరిస్తూ దూసుకుపోతున్నారు. ఇక వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. మరీ అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ నటుడు కూడా ఒకరు. పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ఏదో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ కుర్రాడు యాక్టర్ గా మారి పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లో, సీరియల్స్ లో హీరోగా అలరిస్తున్నాడు. పైగా ఈ హీరోకు ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు బుల్లితెర టాప్ హీరోల్లో ఒకరు. అంతేకాకుండా.. ఈ కుర్రోడు ఇప్పుడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లో అలరిస్తూ తనదైన నటనతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఎవరో గుర్తుపట్టారా.. ఆయన మరెవరో కాదు.. బుల్లితెర హీరో ‘మానస్ నాగులపల్లి’. ఈ పేరు ప్రేక్షకులదరికీ సుపరిచితమే. ఎందుకంటే.. ఈయన ప్రస్తుతం టాప్ వన్ సీరియల్ అయిన ‘బ్రహ్మముడి’లో హీరోగా అలరిస్తున్నాడు. ఇక ఈ హీరోకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మాములుగా ఉండదు. ఇకపోతే ఈ హీరో మొదటిగా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే.. మానస్ మొదటిగా 2004లో మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన ‘అర్జున్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైయ్యాడు.

ఇక ఈ సినిమా తర్వత రవితేజ వీడే, బాలకృష్ణ నరసింహనాయుడు పిరిమాల్లో కూడా నటించాడు. దీని తర్వాత.. వెండితెరపై 2015లో హీరోగా ‘ఝలక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.అయితే మొదటి సినిమాతోనే మంచి నటుడిగా మార్కులు వేసుకున్న మానస్ ఆ తర్వాత కాయ్ రాజా కాయ్, అతను, కై రాజా కై, ప్రేమికుడా, గోలి సోడా, మొదలైన సినిమాలలో నటించాడు. ఇక వెండితెరపై అలరించిన మానస్ ఆ తర్వాత బుల్లితెరై ఎంట్రీ ఇచ్చి టీవీ షో పితృదేవోభవ, భలే ఛాన్సులే, కోయిలమ్మా, కార్తీకదీపం వంటి సీరియల్స్ లో అలరించాడు. దీని తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఎంట్రీ ఇచ్చి తన ఆటతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించాడు.

Manas childhood photo

అయితే ప్రస్తుతానికి బ్రహ్మముడి సిరీయల్ లో హీరోగా అలరిస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే మాన్షన్ అనే వెబ్ సిరీస్ లో మానస్ అలరించాడు. ఇదిలా ఉంటే.. గతేడాది ఈ హీరో 2023 నవంబర్ 22న శ్రీజ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అలాగే త్వరలో ఈ దంపతులిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందబోతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. నేడు (ఆగస్టు 2వతేదీన)  ఈ బుల్లితెర హీరో పుట్టిన రోజు కావడం విశేషం. ఈ క్రమంలోనే మానస్ కు సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. కాగా, ఈ ఫోటోలో అల్లు అర్జున్, మంచు విష్ణుతో కలిసి మానస్ కనిపిస్తాడు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాబోతున్న మానస్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş