iDreamPost
android-app
ios-app

యానిమల్ కు సపోర్ట్ చేసిన భూమి పెడ్నేకర్

  • Published Feb 10, 2024 | 3:11 PM Updated Updated Feb 10, 2024 | 3:11 PM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రానికి వచ్చిన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రంపై తాజాగా భూమి పెడ్నేకర్ స్పందించారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రానికి వచ్చిన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రంపై తాజాగా భూమి పెడ్నేకర్ స్పందించారు.

  • Published Feb 10, 2024 | 3:11 PMUpdated Feb 10, 2024 | 3:11 PM
యానిమల్ కు సపోర్ట్ చేసిన భూమి పెడ్నేకర్

రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రానికి మద్దతుగా నిలిచిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా చేరారు. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు తను అనుకున్న విషయాన్ని సినిమాలో చెప్పే హక్కు ఉందని నటి తెలిపారు. బాలీవుడ్ మీడియా ప్రకారం భూమి ఈ చిత్రాన్ని చూశానని పేర్కొన్నారు, అయితే తాను హైపర్ మాస్క్యులిన్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చూడటానికి ఎప్పుడూ అభిమానిని కాదని పేర్కొన్నారు. రోమ్ కామ్స్ అంటే తనకెంతో ఇష్టమని, ఆ తరహా సినిమాలను తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. యనిమల్ దర్శకుడు సందీప్ వంగా ఈ మధ్య చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ, ఒక చిత్ర దర్శకుడు తన స్వీయ వ్యక్తీకరణకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తానని చెప్పారు. అయితే ఈ సెల్ఫ్ ఎక్స్ ప్రెషన్ నుంచి ప్రేక్షకులు ఏం తీసుకుంటారనే ఛాలెంజ్ ను ఆమె హైలైట్ చేశారు. ఒక సినిమా దర్శకుడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల వివరణే అసలైన సవాలును విసురుతుందని ఆమె పేర్కొన్నారు. నిజానికి బాలీవుడ్ నుండి యానిమల్ సినిమా చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ భూమి పెడ్నేకర్ ఆ సినిమాకి మద్దతుగా నిలిచారు. ఇది ఒక రకంగా మంచి విషయమే.

అంతకు ముందు ప్రఖ్యాత నటి కొంకణ శర్మ కూడా యానిమల్ పై తన ఆలోచనలను పంచుకుంటూ ఇలాంటి సినిమాలు తనకి నచ్చవని చెప్పారు. ఆమె మాట్లాడుతూ “నేను యానిమల్ సినిమా చూడలేదు ఎందుకంటే అది నా తరహా సినిమా అని నాకు అనిపించలేదు. రివ్యూలు, టాక్ నుంచి కూడా నేను దాని వైపు ఆకర్షితులవ్వలేదు. అలాగే, ఆ డైరెక్టర్ మునుపటి సినిమాల గురించి కూడా నాకు తెలుసు, అమ్మాయిలను వెంబడించడం అనే అంశాన్ని గ్లోరిఫై చేయబడింది. ప్రేమికుల మధ్య హింస అనేది కూడా సరైనదే అన్నట్టు చూపించారు. అలాంటి సినిమాల కోసం నిలబడను.”

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş