iDreamPost
android-app
ios-app

వీడియో: ఆ కేంద్ర మంత్రిపై మనస్సు పారేసుకున్న యంగ్ హీరోయిన్..!

  • Published Jun 19, 2024 | 11:48 AM Updated Updated Jun 19, 2024 | 11:48 AM

Nisha Dubey: కొందరు సెలబ్రిటీలు తాము మనస్సు పారేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా యువ కేంద్రమంత్రిపై ఓ నటి మనసు పారేసుకుందంట. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.

Nisha Dubey: కొందరు సెలబ్రిటీలు తాము మనస్సు పారేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా యువ కేంద్రమంత్రిపై ఓ నటి మనసు పారేసుకుందంట. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.

  • Published Jun 19, 2024 | 11:48 AMUpdated Jun 19, 2024 | 11:48 AM
వీడియో: ఆ కేంద్ర మంత్రిపై మనస్సు పారేసుకున్న యంగ్ హీరోయిన్..!

సినీ, రాజకీయ నేతలకు సంబంధించి విచిత్రమైన వార్తలు బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల మధ్య ఉండే లవ్ ఎఫైర్ గురించి ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. ఇది ఇలా ఉంటే కొందరు నటీనటులు..పొలిటికల్ లీడర్స్ పై మనస్సు పారేసుకుంటారు. అంతేకాక తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. కొందరు అయితే నార్మల్ గా అభిమానించగా, మరికొందరు మాత్రం పూర్తిగా వారి ప్రేమలో మునిగిపోతుంటారు. అంతేకాక కొందరు సెలబ్రిటీలు అయితే తాము మనస్సు పారేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా యువ కేంద్రమంత్రిపై ఓ నటి మనసు పారేసుకుంది. అంతేకాక ఆయన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మరి.. ఆ నటి, ఆ మంత్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలే ఎన్నికల ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీయే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడో సారి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో  71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో యంగ్ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఏపీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, యూపీ నుంచి చిరాగ్ పాశ్వాన్ వంటి యంగర్స్ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే భోజ్ పురి నటి నిషా దూబే కీలక విషయాన్ని వెల్లడించారు.

తాను ఓ కేంద్రమంత్రిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ.  అంతేకాక ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసిన నిషా దూబే తన ప్రేమను వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌పై  ఈ బ్యూటీ మనసు పారేసుకున్నట్లు  స్వయంగా వెల్లడించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. చిరాగ్ పాశ్వాన్ పేరు దేశ రాజకీయాల్లో మారుమోగిపోగింది.  100 శాతం స్ట్రైక్ రేట్ తో ఐదు ఎంపీ స్థానాల్లో విజయం సాధించారు. ఈ క్రమంలోనే యువతలో చిరాగ్ పాశ్వాన్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఎంతో మంది చిరాగ్ అంటే ఎంతో ఇష్టపడుతున్నారు.  తాజాగా ఆ జాబితాలోకి ఈ బోజ్ పురి భామ చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను లవ్ చేస్తున్నట్లు నిషా దూబే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిషా దూబే వయసు 25 ఏళ్లు కాగా.. పాశ్వాన్‌ వయసు 41 ఏళ్లు. అయినా తనకంటే 16 ఏళ్లు పెద్దైన చిరాగ్ పాశ్వాన్‌ను ప్రేమిస్తున్నట్లు నిషా తెలిపింది. క తన ప్రేమను వ్యక్త పరుస్తూ ఇటీవల కేంద్రమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేసిన వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ వచ్చేలా కూడా క్రియేట్ చేసింది. ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పిన డైలాగ్ ను ఆ వీడియోకు జత చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే చిరాగ్ పాశ్వాన్ అమాయకత్వపు ముఖం చేస్తే.. ఎవరైనా పడిపోతారని, తన విషయంలో కూడా అదే జరిగిందని క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Nisha Dubey (@nishadubey499)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom