iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటి.. కొన్ని గంటల ముందే

  • Published Apr 28, 2024 | 6:24 PM Updated Updated Apr 28, 2024 | 6:24 PM

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ నటుడు మిస్సింగ్‌ అయ్యాడు. ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు. ఇక తాజాగా మరో నటి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ నటుడు మిస్సింగ్‌ అయ్యాడు. ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు. ఇక తాజాగా మరో నటి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 6:24 PMUpdated Apr 28, 2024 | 6:24 PM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటి.. కొన్ని గంటల ముందే

ఆత్మహత్య మహాపాపం అని పెద్దలు అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప.. మానవ జన్మ లభించదు అంటారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే.. వాటిని దాటుకుంటూ.. ముందుకు సాగాలి. జీవితం అంటే కేవలం సుఖాలు, సంతోషం మాత్రమే ఉండవు.. కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. అన్నింటిని ఓర్చుకుంటూ ముందుకు సాగితినే జీవితం అవుతుంది. అయితే నేడు మన సమాజంలో, జీవితాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా.. ప్రతి చిన్న విషయానికి ఆందోళన, భయం పెరుగుతున్నాయి. చిన్న సమస్య వచ్చినా సరే.. తట్టుకోలేకపోతున్నాం. ఓటమి, ఫెయిల్యూర్‌ వంటి వాటిని అస్సలు తీసుకోలేకపోతున్నాం. దాంతో చిన్న వయసులోనే జీవితాన్ని అంతం చేసుకునే నిర్ణయాలు తీసుకుంటూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని.. ఎందరో అభిమానులను గెలుచుకున్న సెలబ్రిటీలు.. జీవితంలో వచ్చే సమస్యల ముందు తల వంచుతున్నారు. జీవితాలను అంతం చేసుకుని ఓడిపోతున్నారు. ఇక తాజాగా మరో నటి ఈ జాబితాలో చేరింది. ఆత్మహత్య చేసుకుని.. తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ వివరాలు..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ భోజ్‌పురి నటి ఒకరు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఆమె నిర్ణయంతో కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. శనివారం నాడు బిహార్‌, భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె శవమై కనిపించింది. అమృత తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమృతా పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబైలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్‌లో బంధువుల వివాహానికి వెళ్లి.. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడిపింది. ఇంతలోనే ఇలాంటి దారుణానికి పాల్పడింది.

Actress amrita pandey sucide

ఇక శనివారం అమృత తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. అమృత ఆత్మహత్య గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అమృత ఆత్మహత్యకు గల కారణాలు వెలికి తీసే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమృత గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు.. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి ‘దీవానాపన్’ చిత్రంతో తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet