గామి vs భీమా.. రెండిట్లో డే 1 కలెక్షన్స్ దేనికి ఎక్కువంటే?

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటిల్లో అందరి చూపు గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామిలపైనే పడింది. ఇంతకు ఈ రెండు చిత్రాల్లో తొలి రోజు కలెక్షన్స్ ఏ మూవీకి ఎక్కువ వచ్చాయంటే..?

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటిల్లో అందరి చూపు గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామిలపైనే పడింది. ఇంతకు ఈ రెండు చిత్రాల్లో తొలి రోజు కలెక్షన్స్ ఏ మూవీకి ఎక్కువ వచ్చాయంటే..?

మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడాయి. ఇందులో చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి మ్యాచో స్టార్ గోపీచంద్ భీమా, మాస్ కా దాస్ విశ్వస్ సేన్ నటించిన గామి. ఈ రెండు సినిమాలు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకున్నాయి. గోపిచంద్ కెరీర్‌లోనే ఎక్కువ స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా నిలిచింది భీమా. ఇందులో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈచిత్రానికి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకుడు. భీమాలో మ్యాచో మాన్ సరికొత్త లుక్స్‌లో మెప్పించాడు. ఇతిహాస గాధల్లోని పరుశురాముడి కథను ఇప్పుడు పోలీస్  పాత్రను జోడించి రూపొందించారు. సినిమా ట్రైలర్, వరుస ప్రమోషన్లతో ఆడియెన్సులో హైప్ క్రియేట్ చేసుకుంది.

భీమా మూవీ కోసం సుమారు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ ఓపెనింగ్స్‌తో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టుకున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ కావడంతో మరిన్ని కలెక్షన్లను రాబట్టుకునే అవకాశం ఉంది. అయితే దీనికి పోటీగా నిలవనుంది విశ్వక్ గామి. ఈ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. శివరాత్రి రోజునే బిగ్ స్క్రీన్ పై రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యూలాయిడ్ బ్యాన్సర్ పై కార్తీక్ సబరీష్ నిర్మించారు. కగిత విధ్యాదరరావు దర్శకత్వం వహించారు. కొత్త కాన్సెప్ట్‌తో తీసుకు వచ్చిన ఈ చిత్రం విజువల్ వండర్స్‌గా నిలుస్తోంది. గామి కూడా సుమారు రూ. 24 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

గామి కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ నడవడంతో తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.07 కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. విశ్వక్ సేన్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్. షో షోకు దీనికి ఆదరణ బాగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, రెస్టాఫ్ ఇండియా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ చిత్రం. ఇప్పుడు వస్తున్న బజ్ ఈ వీకెంట్‌లో దీని హవా నడిచే అవకాశం కనిపిస్తుంది. భారీగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ఇది సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక భీమా, గామి చిత్రాల్లో వసూళ్ల పరంగా గామి పై చేయి సాధించింది. భీమా కన్నా గామికే ఎక్కువ కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ నుండి సినిమా ఆక్యుపెన్సీ వరకు అన్నింటా గామినే అగ్ర స్థానంలో కొనసాగుతుంది. అయితే లాంగ్ రన్‌లో ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్ అనేది తేలిపోతుంది.

Show comments