iDreamPost
android-app
ios-app

నాని భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

  • Published Aug 29, 2024 | 6:18 PM Updated Updated Aug 29, 2024 | 6:18 PM

నాని హీరోగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం భీమిలి కబడ్డీ జట్టు. క్లాసిక్ హిట్ మూవీగా నిలిచింది. ఇందులో హీరోయిన్ గుర్తుందా. ఉన్నవి తక్కువ సీన్లే అయినప్పటికీ.. తన నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగులో నాలుగు సినిమాలతో సరిపెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే...?

నాని హీరోగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం భీమిలి కబడ్డీ జట్టు. క్లాసిక్ హిట్ మూవీగా నిలిచింది. ఇందులో హీరోయిన్ గుర్తుందా. ఉన్నవి తక్కువ సీన్లే అయినప్పటికీ.. తన నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగులో నాలుగు సినిమాలతో సరిపెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే...?

  • Published Aug 29, 2024 | 6:18 PMUpdated Aug 29, 2024 | 6:18 PM
నాని భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. తొలి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి రివ్యూస్, రేటింగ్‌తో పబ్లిసిటీ మరింత పెరిగింది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకెళ్లడం మామూలు విషయం కాదు. తొలి నాళ్లల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. మంచి చిత్రాలతో ఆకట్టుకున్నాడు ఈ హీరో. వాటిల్లో ఒకటి.. భీమిలి కబడ్డీ జట్టు. 2010లో వచ్చిన ఈ మూవీలో చాలా న్యాచురల్ అంటే డీ గ్లామరైజ్డ్ పాత్రలో మెరిశాడు. తాటినేని సత్య డెబ్యూ డైరెక్టరుగా తెరకెక్కిన ఈ మూవీలో మాలీవుడ్ సోయగం శరణ్య మోహన్ నటించింది. విలేజ్‌లో వినాయకుడు చిత్రంలో ఆకట్టుకున్న ఈ అమ్మాయి.. ఆ వెంటనే చేసిన మూవీ భీమిలి కబడ్డి జట్టు. ఇందులో మెరిసింది కాసేపే అయిన కట్టిపడేస్తుంది. తెలుగులో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

కేరళలోని అలప్పుజలో పుట్టిన ఈ మాలీవుడ్ భామ.. భరత నాట్యంలో ప్రావీణ్యురాలు. చదువులో కూడా మేటే. అన్నామలై యూనివర్శిటీ నుండి ఎంఏ ఇంగ్లీషులో లిటరేచర్ చేసింది. అలాగే భరతనాట్యంలో కూడా కోర్స్ పూర్తి చేసింది. అలా స్కూల్లో ప్రదర్శన ఇస్తుండగా.. ఫహాద్ ఫజిల్ తండ్రి ఫజిల్ కళ్లలో పడి.. ఆమెను ఓ మలయాళ చిత్రానికి ఆఫర్ చేయడంతో.. అనియాతి పువ్వు అనే చిత్రంలో నటించింది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్టుగా అడపాదడపా చిత్రాల్లో చేసిన ఆమె.. తర్వాత సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యింది. తర్వాత హీరోయిన్‪గా నటించింది. తమిళంలో ఆమె నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో లక్కీ లేడీ అన్న ముద్ర వేయించుకుంది. తమిళంలో చేస్తే తెలుగులో కూడా రావాల్సిందే కదా.. అలా విలేజ్‌లో వినాయకుడు చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసింది.

saranya mohan pic talk

ఆ తర్వాత నాని భీమిలీ కబడ్డీ జట్టులో చేసింది. కనిపించేది కొన్ని సీన్సే అయిన.. అచ్చ తెలుగు అమ్మాయిగా ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ కత్తిలో హీరో సోదరిగా నటించంది. అలాగే హ్యపీ హ్యపీగా చిత్రంలో మెరిసి మాయం అయిపోయింది. మలయాళం, తమిళ చిత్రాలను చేసిన ఆమె.. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ డా. అరవింద్ కృష్ణన్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఆమెకు కొడుకు అనంత పద్మనాభన్, కూతురు అన్నపూర్ణ ఉన్నారు. 2014 నుండి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. డ్యాన్స్ వీడియోలతో పాటు.. వర్కౌట్స్, ఫ్యామిలీ, పిల్లల ఫోటోలతో ట్రెండ్‌లో నిలుస్తుంది. ఫన్నీ వీడియోలు చేస్తూ తన అభిమానుల్ని ఆనందింప చేస్తోంది ఈ క్యూటీ శరణ్యమోహన్.

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet