iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భక్షక్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

  • Published Feb 09, 2024 | 9:25 PM Updated Updated Feb 12, 2024 | 12:55 PM

Bhakshak Movie Streaming: ఓటీటీలో ఇటీవల కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ కావడంతో సినీ ప్రేమికులు వీక్ ఎండ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Bhakshak Movie Streaming: ఓటీటీలో ఇటీవల కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ కావడంతో సినీ ప్రేమికులు వీక్ ఎండ్ కోసం ఎదురు చూస్తున్నారు.

OTTలోకి వచ్చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భక్షక్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయితే ధియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ టికెట్ కొని మూవీ చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. టెక్నాలజీ పుణ్యమా అని ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనా కాలంలో చాలా మంది ఓటీటీ కే పరిమితం అయ్యారు. ఆ సమయంలో థియేటర్లు మూసి వేయడంతో ఇంట్లో కూర్చొని ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ టైమ్ పాస్ చేశారు. దీంతో ఓటీటీకి బాగా ప్రాబల్యం పెరిగిపోయింది. ఓటీటీలో భారతీయ చిత్రాలే కాదు.. విదేశా భాషా చిత్రాలు కూడా వస్తున్నాయి. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘భక్షక్’. ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ నటించిన ఇన్వేస్టిగేటీవ్ థ్రిల్లర్ మూవీ ‘భక్షక్’ ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

సినిమా కథ విషయానికి వస్తే.. హాస్టల్స్ లో ఉండే అనాధ అమ్మాయిలు అత్యాచారాలకు గురి అవుతుంటారు. ఈ దారుణాలు లోకల్ మాఫియా లీడర్  నడిపిస్తుంటాడు. ఈ మాఫియా గురించి అందరికీ తెలిసినా.. అతనికి భయపడి ఊరుకుంటారు. అలాంటి సమయంలో మాఫియా గుట్టు బయట పెట్టడానికి ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ రంగంలోకి దిగుతుంది. బాలికలు, మహిళలపై జరుగుతు అకృత్యాలను ఆ జర్నలిస్ట్  ఎలా అడ్డుకట్ట వేసింది.. ప్రజల్లోకి ఎలాంటి ఆధారాలతో ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లింది.. ఆ సమయంలో ఆమెకు ఎదురైన కష్టాలు, సవాళ్లు ఏంటీ అనేది తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో భూమి పెడ్నెకర్, సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్ హంగకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ చూసే ఆడియన్స్ కి ఇది బాగా నచ్చుతుందని అంటున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/