Arjun Suravaram
Utpalendu Chakrabarty: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు.
Utpalendu Chakrabarty: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు.
Arjun Suravaram
తరచూ సినీ, రాజకీయా రంగాల్లో విషాదలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, అనారోగ్య సమస్య, గుండెపోటు వంటి వివిధ కారణాలతో పలువురు సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. అది కూడా బెంగాలీ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఉత్పలేందు చక్రవర్తి(76) కన్నుమూశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఉత్పలేందు చక్రవర్తి బెంగాలీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనేక సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మరణించారు. కలకత్తాలోని రీజెంట్ పార్క్ లోని తన నివాసం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్ల నుంచి సీవోపీడీ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ తన నివాసంలోనే ఉంటున్నారు.
ఇలా సీవోపీడీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఏడాది ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా బాత్రూంలో పడిపోయాడు. దీంతో ఆయన కాలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇటీవల నెమ్మదిగా కొలుకుంటున్న సమయంలోనే మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారు. దీంతో తిరిగిరాని లోకాలకు ఈ స్టార్ డైరెక్టర్ వెళ్లిపోయారు. ఆయన మృతిపట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. చక్రవర్తి మరణం అనేది సినీ పరిశ్రమలో తీరని లోటని సీఎం దీదీ పేర్కొన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
అదే విధంగా దేశంలోనే అతి పురాతన ఫిల్మ్ క్లబ్‌లలో ఒకటైన సినీ సెంట్రల్.. ఉత్పలేందు చక్రవర్తి మృతికి సంతాపం ప్రకటించింది. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే.. ఇద్దరు కుమార్తె రీతాభరి, చిత్రాంగద, భార్య సతరూప సన్యాల్ ఉన్నారు. ఆయన స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్త విశ్వవిద్యాలయాల్లో చదివారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్, దేబబ్రత బిస్వాస్ వంటి పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. ఆయన 1981లో తన తొలి సినిమాకే ఇందిరా గాంధీ ప్రఖ్యాత అవార్డు వరించింది. 1983లో చోఖ్ చిత్రానికి బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డులు అందుకున్నారు. అదే విధంగా ఎన్ఎఫ్డీసీ అవార్డు, రాష్ట్రపతి అవార్డును కూడా పొందారు. ఆయన తన సినీ కెరీర్‌లో మోయన్‌తాడంటో (1980), చందనీర్ (1989), ఫాన్సి (1988), దేబ్‌శిశు (1987) వంటి సూపర్ హిట్ మూవీస్ తో సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.