Balakrishna 50 Years Industry: బాలకృష్ణ@50 ఇయర్స్! ఘనంగా స్వర్ణోత్సవ వేడుకల కర్టెన్ రైజర్ ఈవెంట్!

బాలకృష్ణ@50 ఇయర్స్! ఘనంగా స్వర్ణోత్సవ వేడుకల కర్టెన్ రైజర్ ఈవెంట్!

Nandamuri Balarkishna Completing 50 Years In Film Industry By August 30th: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పిలుపుకు అర్హత దక్కించుకున్నారు. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు వచ్చి ఈ ఆగస్టు 30తో 50 వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించి కర్టెన్ రైజర్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.

Nandamuri Balarkishna Completing 50 Years In Film Industry By August 30th: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పిలుపుకు అర్హత దక్కించుకున్నారు. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు వచ్చి ఈ ఆగస్టు 30తో 50 వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించి కర్టెన్ రైజర్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.

‘తాతమ్మ కల’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974లో ఆగస్టు 30న విడుదలైంది. ఈ ఆగస్టు 30తో ఈ సినిమా వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. ఈ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, స్టోరీ రైటర్ గా, నిర్మాతగా వ్యవహరించారు. ఇదే సినిమాతో నందమూరి బాలకృష్ణ వెండితెరకు పరిచయమయ్యారు. ఆగస్టు 30వ తేదీ వస్తే బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. ఈ స్వర్ణోత్సవ వేడుకలను సెప్టెంబర్ 1న నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా బుధవారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలను జరపనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, కైకాల నాగేశ్వరరావు, సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. 50 నిమిషాలు నడిస్తేనే అలసిపోతాం.. అలాంటిది బాలకృష్ణ 50 ఏళ్ల పాటు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినీ పెద్దలు ఆయనకు సన్మానం చేయడం అభినందించదగ్గ విషయం’ అని అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక బాలకృష్ణ సోదరుడు నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అని అన్నారు. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా బాలకృష్ణ నిరూపించుకున్నారని, సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలో నిలబడ్డారని అన్నారు. ఇక దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఇంకా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల పాటు నటుడిగా చేయడంలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే అని అన్నారు. తనకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ అని.. నిర్మాతల మనిషి అని అన్నారు. అలాంటి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీ అంతా కలిసి ఈ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తమ్మారెడ్డి భరద్వాజ కోరారు.

Show comments