iDreamPost
android-app
ios-app

Venu Yeldandi: ‘బలగం’ సినిమా అందరూ చూశారు ఒక్క ఆయన తప్ప.. వేణు ఎమోషనల్ పోస్ట్!

  • Published Feb 08, 2024 | 10:02 PM Updated Updated Feb 08, 2024 | 10:02 PM

బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అందులో నా బలగం మూవీ అందరూ చూశారు.. కానీ ఆయనొక్కరే చూడలేదంటూ భావోద్వేగానికి గురైయ్యాడు.

బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అందులో నా బలగం మూవీ అందరూ చూశారు.. కానీ ఆయనొక్కరే చూడలేదంటూ భావోద్వేగానికి గురైయ్యాడు.

  • Published Feb 08, 2024 | 10:02 PMUpdated Feb 08, 2024 | 10:02 PM
Venu Yeldandi: ‘బలగం’ సినిమా అందరూ చూశారు ఒక్క ఆయన తప్ప.. వేణు ఎమోషనల్ పోస్ట్!

‘బలగం’ చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించడమేకాకుండా.. గ్రామాల్లోకి చొచ్చుకెళ్లింది. ఇక ఈ మూవీతో డైరెక్టర్ గా మారాడు జబర్దస్త్ వేణు. అల్టిమేట్ మేకింగ్ తో ప్రేక్షకులను ఏడిపించాడు ఈ హాస్యనటుడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతటితో ఆగకుండా.. ఏకంగా పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఈ మూవీపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు వేణు. నా బలగం మూవీని అందరూ చూశారు.. కానీ ఆయన ఒక్కరే చూడలేదు అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు.

బలగం సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ వేణు యెల్దండి. కమెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చిన అతను జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షోతో వచ్చిన క్రేజ్ ను అద్భుతంగా ఉపయోగించుకుని తనలో ఉన్న దర్శకుడిని పరిశ్రమకు పరిచయం చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. వంద ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది ఈ మూవీ.

ఇక ఈ మూవీపై తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు డైరెక్టర్ వేణు. “నేను తీసిన బలగం సినిమాను అందరూ చూశారు. ఒక్క మా నాన్న తప్ప. మిస్ యూ నాన్న” అంటూ వేణు తండ్రిని తలచుకుని భావోద్వేగానికి గురైయ్యాడు. తండ్రి ఫొటోను షేర్ చేసి.. ఆయన చనిపోయిన తేదీని రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో నే హిట్టు సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు. మరోసారి ఇదే బ్యానర్ లో రాబోతున్నాడు వేణు. ఏకంగా న్యాచురల్ స్టార్ నాని-దిల్ రాజు-వేణు కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదికూడా చదవండి: Anchor Suma: వీడియో: పెరిగిపోతున్న కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా యాంకర్ సుమానే..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş