iDreamPost
android-app
ios-app

Bade Miyan Chote Miyan Review: బడే మియా చోటే మియా ట్రైలర్ రివ్యూ

  • Published Mar 26, 2024 | 2:26 PM Updated Updated Mar 26, 2024 | 6:07 PM

బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బడే మియా చోటే మియా. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బడే మియా చోటే మియా. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 26, 2024 | 2:26 PMUpdated Mar 26, 2024 | 6:07 PM
Bade Miyan Chote Miyan Review: బడే మియా చోటే మియా ట్రైలర్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బడే మియా చోటే మియా. పూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మరో రెండు వారాల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి థియేటర్లలో రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక బడే మియా చోటే మియా ట్రైలర్ విషయానికి వస్తే… టీజర్ లో లాగానే పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగ్స్ తో స్టార్ట్ అవుతుంది. కాకపోతే అక్కడ కేవలం వాయిస్ వినిపిస్తే ట్రెయిలర్ లో పృథ్వీరాజ్ మొహం కమపడకుందా మాస్క్ తగిలించుకుని ఉన్నారు. భారత దేశానికి సంభందించిన మోస్ట్ పవర్ఫుల్ ఆయుధాన్ని పృధ్వీరాజ్ దొంగిలిస్తారు. కాగా మూడు రోజుల డెడ్ లైన్ ను కూడా విధిస్తారు. ఇంతటి క్రూయెల్ విలన్ ని ఆపాలంటే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ల వల్లే అవుతుందని వాళ్ళిద్దరికీ మిషన్ కు అప్పగిస్తారు.

నిజానికి వాళ్ళు స్నేహితులే అయినా ప్రాణాలకు తెగించి విలన్ తో పోరాటం చేసే సమయంలో కూడా ఒకరి పై ఒకరు ఆధిపత్యాన్ని చూపించటానికి ప్రయత్నించడం మనం ట్రైలర్ లో చూడచ్చు. వీరిద్దరితో పాటు హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కూడా మిషన్ లో పాల్గొంటారు. ఈ టీమ్ అంతా కలిసి విలన్ పృథ్వీరాజ్ ను ఎలా ఎదుర్కున్నారనేదే మిగతా కథ. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఉత్కంఠని పెంచే కథాంశం, ఎమోషన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలకి ఏమాత్రం లోటు లేదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

సుల్తాన్, టైగర్ జిందా హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాని వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వచ్చే నెల రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్ లవర్స్ కి రోలర్ కొస్టర్ రైడ్ గా తెరకెక్కిన బడే మియా చోటే మియా ట్రైలర్ ని తొందరగా చూసేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş