iDreamPost
android-app
ios-app

కొనసాగుతున్న ‘బేబీ’ రికార్డుల పర్వం.. ఏకంగా మహేశ్ సినిమాలనే..!

కొనసాగుతున్న ‘బేబీ’ రికార్డుల పర్వం.. ఏకంగా మహేశ్ సినిమాలనే..!

తెలుగు ప్రేక్షకుల గురించి ఒక విషయం అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. మూవీలో విషయం ఉంటే అది ఏ భాషది? హీరో హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ కొత్తోడా పాతోడా? పెద్ద సినిమానా- చిన్న సినిమానా? అని ఏం పట్టించుకోరు. డైరెక్ట్ థియేటర్ కి వెళ్లిపోతారు అంతే. ఆ విషయం బేబీ సినిమాతో మరోసారి రుజువైంది. టాప్ స్టార్ కాస్ట్ లేదు.. టాప్ డైరెక్టర్ ఏం కాదు.. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పది రోజులు అవుతున్నా.. ఏ మాత్రం ఊపు తగ్గలేదు. అంతేకాదండోయ్.. ఏకంగా మహేశ్ బాబు సినిమాలనే బీట్ చేసింది.

సాయి రాజేశ్ డైరెక్షన్ లో.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో ఎస్కేఎన్ తెరకెక్కించారు. ఈ సినిమా జులై 14న రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక కల్ట్ సినిమాగా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు తిరగ రాస్తోంది. దాదాపు రెండేళ్లపాటు సినిమా బృందం పడిన కష్టం ఇప్పుడు కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. సినిమా రిలీజై 10 రోజులు దాటుతున్నా.. కలెక్షన్స్ పెరుగుతున్నాయి గానీ, ఎక్కడా తగ్గడం లేదు.

పైగా సినిమా రిలీజైన తర్వాత 10వ రోజు బాక్సాఫీస్ షేర్ లెక్కల్లో బేబీ రికార్డులు సృష్టించింది. ఏకంగా పదో రోజు షేర్ కలెక్షన్స్ లో టాలీవుడ్ టాప్-10 లిస్టులోకి ఎంటర్ అయిపోయింది. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ చేసిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరూ సినిమాలను వెనక్కి నెట్టి ఈ బేబీ సినిమా టాప్-7లో నిలిచింది. పదోరోజు బేబీ సినిమాకి రూ.3.40 కోట్లు షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదండోయ్ ఈ సినిమా 11 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంట. అంటే అర్జున్ రెడ్డి లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని బేబీ సినిమా చాలా తక్కువ రోజుల్లోనే బీట్ చేసింది. అలా అన్న సినిమాను తమ్మడు బీట్ చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ రికార్డు స్థాయి కలెక్షన్స్ చూసి ప్రేక్షకులు మాత్రమే కాదు.. అటు నిర్మాతలు, బయ్యర్లు కూడా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఇంక బేబీ సినిమా కొనుగోలు చేసిన బయ్యర్ల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బేబీ చిత్రం.. ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సాయి రాజేష్ రైటర్ గా వ్యవహరించిన కలర్ ఫొటో ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు బేబీ సినిమాతో డైరెక్టర్ గా కూడా తానేంటో నిరూపించుకున్నాడు. టాలీవుడ్ కు ఒక కల్ట్ రైటర్- డైరెక్టర్ దొరికేశాడంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. బేబీ సినిమా సాధిస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

పదో రోజు షేర్ లో టాప్ 10 మూవీస్:

  • RRR- రూ.16.10 కోట్లు
  • బాహుబలి 2- రూ.8.55
  • వాల్తేరు వీరయ్య- రూ.6.66 కోట్లు
  • బాహుబలి- రూ.5.45 కోట్లు
  • ధమాకా- రూ.4.20 కోట్లు
  • రంగస్థలం- రూ.3.88 కోట్లు
  • అల వైకుంఠపురములో- రూ.3.71 కోట్లు
  • పుష్ప- రూ.3.41 కోట్లు
  • బేబీ ది మూవీ- రూ.3.40 కోట్లు
  • సరిలేరునీకెవ్వరు- రూ.3.18 కోట్లు
  • శ్రీమంతుడు- రూ.2.81 కోట్లు

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap