iDreamPost
android-app
ios-app

వాలంటైన్స్ డే రోజున బేబీ రీమేక్ అప్డేట్

  • Published Feb 05, 2024 | 5:08 PM Updated Updated Feb 05, 2024 | 5:09 PM

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన 'బేబీ' మూవీ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ వాలంటైన్స్ డే రోజున బేబీ రీమేక్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ రానుంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన 'బేబీ' మూవీ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ వాలంటైన్స్ డే రోజున బేబీ రీమేక్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ రానుంది.

  • Published Feb 05, 2024 | 5:08 PMUpdated Feb 05, 2024 | 5:09 PM
వాలంటైన్స్ డే రోజున బేబీ రీమేక్ అప్డేట్

వాలంటైన్స్ డే రోజున కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ యొక్క రీమేక్ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. గత సంవత్సరం జులైలో విడుదలైన బేబీ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కాగా దర్శకుడు సాయి రాజేష్ ను లైమ్ లైట్ లోకి తీసుకువచ్చింది.ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘బేబీ’ యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సాయి రాజేష్ దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. సహజమైన నటనకు తోడు అద్భుతమైన పాటలు, భావోద్వేగ సన్నివేశాలు సినిమా ఘన విజయం సాధించేందుకు సహాయ పడ్డాయి.

ఒక బస్తీ అమ్మాయి రిచ్ కాలేజీలో చేరిన సమయంలో ఆమె జీవితం ఎలా మారింది.. తన ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది అనే అంశాలను దర్శకుడు సాయి రాజేష్ చూపించారు. ముఖ్యంగా చివరి అరగంటలో ఆయన పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బేబీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా బేబీ హిందీ రీమేక్ గురించిన అప్‌డేట్ వాలెంటైన్స్ డే రోజున వస్తుందని ఒక కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కెఎన్ తెలిపారు. హిందీ వెర్షన్‌కి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను ఫిబ్రవరి 14న వెల్లడించనున్నారు. బేబీని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నట్లు ఎస్‌కెఎన్ తెలిపారు.

హిందీ రీమేక్‌కు సాయి రాజేష్ స్వయంగా మెగాఫోన్ పట్టనున్నారా? లేక మరేవరైనా బాలీవుడ్ దర్శకుడు ఈ రీమేక్‌ని చేపడతారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. తెలుగు వెర్షన్‌లో నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, మరియు కీర్తనలు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఆయా పాత్రలను హిందీలో ఎవరు పోషిస్తారో మరియు హీరో హీరోయిన్లు గా ఎవరు నటిస్తారు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş