iDreamPost
android-app
ios-app

బాలీవుడ్‌లో బేబి రీమేక్ ఫిక్స్! హీరోయిన్ ని సరిగ్గా పట్టారు!

  • Published Feb 07, 2024 | 6:34 PM Updated Updated Feb 07, 2024 | 6:39 PM

గత ఏడాది సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం కల్ట్ బొమ్మగా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ బాట పట్టింది..రీమేక్ రూపంలో..

గత ఏడాది సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం కల్ట్ బొమ్మగా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ బాట పట్టింది..రీమేక్ రూపంలో..

  • Published Feb 07, 2024 | 6:34 PMUpdated Feb 07, 2024 | 6:39 PM
బాలీవుడ్‌లో బేబి రీమేక్ ఫిక్స్! హీరోయిన్ ని సరిగ్గా పట్టారు!

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన కల్ట్ మూవీ బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ రోల్స్ చేయగా.. సుమారు 100 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. యూట్యూబర్, అప్పుడప్పుడే సైడ్ రోల్స్‌తో మెప్పిస్తున్న వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్ గా మారింది.  రిలీజ్ అయ్యాక ఆమె ఎంత నెగిటివిటీని మూటకట్టుకుందో.. అంత స్టార్ డమ్ వచ్చింది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఇక ఈ సినిమాకు ఫిదా అయిన చిరంజీవి, అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించిన సంగతి విదితమే.

 బేబి హిట్  కావడంతో ఈ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే బాలీవుడ్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా సాయి రాజేషే దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా.. బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కల్ట్ బొమ్మను హిందీలో కూడా ఎస్‌కేఎన్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. వైష్ణవి చేయబోయే పాత్రను ఓ కొత్తమ్మాయితో చేయించబోతున్నారని టాక్ నడుస్తోంది. అదీ కూడా స్టార్ నిర్మాత కూతురు నటిస్తోందట. బేబి సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైష్ణవి పోషించిన పాత్రను ఎవరు చేయబోతున్నారంటే..అతిలోక సుందరి శ్రీదేవి రెండవ తనయ, జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్. బోనీ కపూర్ కానీ, కరణ్ జోహార్ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఛాన్స్ తన కూతురు రావాలని బోనీ కపూర్ ప్రయత్నాలు చేశాడట. ఏదేమైనా ఖుషీ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీ ఖుషీ ఖాతాలో పడి.. హిట్ అయితే.. అక్క బాటలోనే చెల్లి కూడా టాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి. అక్క జాన్వీ కపూర్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తోన్న సంగతి విదితమే. కొరటాల శివ దీనికి దర్శకుడు. అక్టోబర్ నెలలో మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా విడుదల కాకుండానే బుచ్చిబాబు- రామ్ చరణ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

who is baby in bollywood

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss