iDreamPost
android-app
ios-app

బేబీ నిర్మాత SKN ఇంట తీవ్ర విషాదం.. కొత్త ఏడాది ప్రారంభంలోనే

  • Published Jan 04, 2024 | 2:03 PM Updated Updated Jan 04, 2024 | 6:35 PM

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసర్.. ఎస్‌కేఎన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆ వివరాలు

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసర్.. ఎస్‌కేఎన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆ వివరాలు

  • Published Jan 04, 2024 | 2:03 PMUpdated Jan 04, 2024 | 6:35 PM
బేబీ నిర్మాత SKN ఇంట తీవ్ర విషాదం.. కొత్త ఏడాది ప్రారంభంలోనే

నూతన సంవత్సరంలో కూడా ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. కొత్త ఏడాది ప్రాంరభమైన దగ్గర నుంచి ప్రతి రోజు ఏదో ఒక ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ పరిశ్రమలకు చెందిన వారు… వారి ఆప్తులు ఇలా ఎవరో ఒకరు కన్ను మూస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హాలీవుడ్ బ్యాట్ మ్యాన్ మూవీ ఫేమ్ టామ్ విల్కిన్సన్ తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసర్.. ఎస్‌కేఎన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గురువారం ఉదయం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. దాంతో నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్‌ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో సూర్య ప్రకాశరావు అంత్యక్రియలు జరుగుతాయని ఎస్‌కేఎన్‌ కుటుంబం తెలిపింది.

tragedi in skn house

చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్‌కేఎన్‌ ముందుగా చిన్న ఫిల్మ్ రిపోర్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆతరువాత ఆయన అల్లు అర్జున్ పీఆర్ఓగా మారారు. ఆతరువాత డిస్ట్రీబ్యూటర్ గా ఎదిగి.. అల్లు అరవింద్ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో నిర్మాతగా మారారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన ఎస్‌కేఎన్‌.. 2018లో వచ్చిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయమయ్యారు. ఆ మూవీ రిలీజ్ కి ముందే మొత్తం నెట్టింట లీక్ అయినా నిర్మాతగా మంచి సక్సెస్ నే అందుకున్నారు.

ఇక రెండో సినిమా ‘బేబీ’తో అయితే సంచలనమే సృష్టించారు. ఏ అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టింది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. వైష్ణవిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ చేసిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ బేబీ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.

బేబీ సినిమా భారీ విజయంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఎస్‌కేఎన్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే తెలుగులో హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఆమె చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. వీటితో పాటు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలను మరోసారి హీరోహీరోయిన్లుగా చూపిస్తూ ఒక సినిమాని అనౌన్స్ చేశారు ఎస్‌కేఎన్‌

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet