iDreamPost
android-app
ios-app

పెళ్లి కోసం దాచిన డబ్బు తిన్న చెదలు .. బేబీ నిర్మాత సాయం..

  • Published Nov 19, 2023 | 6:36 PM Updated Updated Nov 19, 2023 | 6:36 PM

బేబీ చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చెదల కారణంగా కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులు పోగొట్టుకున్న జంటకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

బేబీ చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చెదల కారణంగా కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులు పోగొట్టుకున్న జంటకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

  • Published Nov 19, 2023 | 6:36 PMUpdated Nov 19, 2023 | 6:36 PM
పెళ్లి కోసం దాచిన డబ్బు తిన్న చెదలు .. బేబీ నిర్మాత సాయం..

మనం అనుకున్నట్లే అన్నీ జరిగితే అది జీవితం అవ్వదు. కొన్నిసార్లు అనుకోని కష్టాలు వచ్చిపడుతుంటాయి. వాటి కారణంగా జీవితం తల్లకిందులు అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఓ వైపు నుంచి మనకు కష్టాన్ని ఇచ్చిన దేవుడే.. మరో వైపునుంచి మనిషి రూపంలో ఆ కష్టానికి పరిష్కారంగా సాయాన్ని కూడా అందిస్తాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ.. ఓ జంట తమ కూతురి కోసం పెద్ద మొత్తంలో పెట్టెలో డబ్బు దాచింది. ఆ డబ్బును అనుకోని విధంగా చెదలు తినేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట కూతురి పెళ్లి కోసం బ్యాంకులో కాకుండా పాత ట్రంకు పెట్టెలో డబ్బు దాచింది. దాదాపు రెండు లక్షల రూపాయలు దాచుకుంది. అయితే, ఆ డబ్బును చెదలు తినేశాయి. దీంతో ఆ జంట గొల్లుమంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జంట కన్నీరు పెట్టుకోవటం పలువురిని కదిలించింది. అలాగే ఈ వీడియో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్‌ దృష్టికి కూడా వెళ్లింది.

వారి కష్టం చూసి ఎస్‌కేఎన్‌ మనసు కూడా ద్రవించింది. దీంతో ఆయన ఆ జంటకు సాయం చెయ్యాలని భావించారు. వారు చెదల కారణంగా పోగొట్టుకున్న మొత్తాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఈమేరకు ఆదివారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ చాలా విషాదకరమైన సంఘటన. వారు ఓ ట్రంక్‌ పెట్టెలో డబ్బులు దాచుకోవటం వారి అమాయకత్వానికి అద్దం పడుతోంది. ఎవరైనా వారిని ఎలా కాంటాక్ట్‌ చేయాలో చెప్పండి.

నేను వారికి సాయం చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఎస్‌కేఎన్‌ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆయన మంచితనంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు కూడా తమకు తోచినంత సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాగా, ఎస్‌కేఎన్‌ అలియాస్‌ శ్రీనివాస కుమార్‌ నాయుడు తెలుగులో పలు హిట్టు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.  ఈ రోజుల్లో, టాక్సీవాలా, ఎమ్‌ఆర్‌వీ, బేబీ సినిమాలను నిర్మించారు.

బేబీ సినిమాతో ఆయన పేరు తెలుగునాట మారుమోగింది. ఇక, ప్రతీరోజు పండుగ రోజే, మహానుభావుడు, భలేభలే మగాడివోయ్‌, పీసీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎస్‌కేఎన్‌ అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ ఉంటారు. అలా చేస్తూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. మరి, ట్రంకు పెట్టెలో పెళ్లి కోసం దాచిన 2 లక్షల రూపాయల్ని చెదలు తినేయటంతో కష్టాల్లో పడ్డ జంటకు ఎస్‌కేఎన్‌ సాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş