iDreamPost
android-app
ios-app

‘బేబీ’ హీరో విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమాకు ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు!

  • Published Jul 18, 2023 | 11:34 AM Updated Updated Jul 18, 2023 | 11:34 AM
  • Published Jul 18, 2023 | 11:34 AMUpdated Jul 18, 2023 | 11:34 AM
‘బేబీ’ హీరో విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమాకు ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు!

చిన్న చిత్రంగా తెరకెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద ఊహించిన రేంజ్‌లో భారీ విజయం సాధించిన సినిమా బేబీ. నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిన బేబీ సినిమా మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకంటే ముందే టీజర్‌, ట్రైలర్‌, పాటలు.. బేబీ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచాయి. ఇక సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఐదు రోజుల్లోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్లు సాధించి.. లాభాల్లో దూసుకుపోతుంది. సాయి రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యింది. నేటి తరం ప్రేమలకు ఈ సినిమా అద్దం పడుతుందని అంటున్నారు ప్రేక్షకులు. సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో.. ఆదివారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉండగా సినిమాలో సెకండ్‌ హీరో పాత్రలో నటించిన విరాజ్‌ అశ్విన్‌ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. ఇక అతడి బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకున్న ప్రేక్షకులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. మరి అంతలా షాకిచ్చిన ఆ వివరాలు ఏంటి అంటే.. బేబీ చిత్రంలో సెకండ్‌ హీరోగా నటించిన విరాజ్‌ అశ్విన్‌.. ఈ సినిమా కన్నా ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికి.. అవేవి అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. మరి బేబీ కన్నా ముందు విరాజ్‌ ఏ సినిమాల్లో నటించాడు అంటే.. యాంకర్‌ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థాంక్యూ బ్రదర్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. అనగనగా ఓ ప్రేమ కథ అనే సినిమాతో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విరాజ్‌. కాకపోతే ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో.. అతడికి అనుకున్న మేర గుర్తింపు రాలేదు.

గిన్నిస్‌ రికార్డు సాధించిన చిత్రం..

ఇక విరాజ్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన థాంక్యూ బ్రదర్‌ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత విరాజ్‌ మనసానమః అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాడు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ ఫిలిం సంచలనాలు సృష్టించింది. ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని రికార్డులు సృష్టించింది. ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న షార్ట్‌ ఫిల్మ్‌గా మనసానమః చిత్రం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. పైగా ఈ సినిమా ఆస్కార్స్‌కు కూడా క్వాలిఫై అయ్యింది. విరాజ్‌ నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఇలాంటి రికార్డు క్రియేట్‌ చేసినప్పటికి కూడా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తర్వాత విరాజ్‌ మాయపేటిక అనే సినిమాలో నటించాడు. కానీ అది డిజాస్టర్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంది. కానీ బేబీ చిత్రంలో సెకండ్‌ హీరోగా నటించినప్పటికి.. విరాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం వరుస అవకాశాలు విరాజ్‌ తలుపు తడుతున్నాయి అని సమాచారం. మరో విశేషం ఏంటంటే.. విరాజ్‌ అశ్విన్‌.. తన చిన్నతనంలోనే పవన్‌ కళ్యాణ్‌తో దిగిన కొన్ని ఫొటోలు గత కొన్ని రోజులుగా సోఫల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. దాంతో ఇతడికి ఇండస్ట్రీతో మంచి పరిచయాలే ఉన్నాయని అర్థం అవుతోంది. మరి బేబీ ఇంత పెద్ద విజయం సాధించింది కదా.. ఇక విరాజ్‌ కెరీర్‌ ఎలా టర్న్‌ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు. అలానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన వైష్ణవి చైతన్య కూడా యూట్యూబ్‌ వీడియోలతోనే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరందరికి బేబీ చిత్రం టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş