iDreamPost
android-app
ios-app

బేబీ సినిమా కోసం హీరో,హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే..

  • Published Jul 22, 2023 | 11:32 AM Updated Updated Jul 22, 2023 | 11:32 AM
  • Published Jul 22, 2023 | 11:32 AMUpdated Jul 22, 2023 | 11:32 AM
బేబీ సినిమా కోసం హీరో,హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే..

ప్రముఖ తెలుగు దర్శకుడు సాయి రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన సంగతే. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. రిలీజై రోజులు గుడుస్తున్నా వసూళ్లు మాత్రం తగ్గటం లేదు. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బేబీ సినిమా హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఆ విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్యలు చాలా తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్‌ దేవరకొండ 80 లక్షలకు పైనే తీసుకున్నారని సమాచారం. ఇక, సెకండ్‌ మీరో విరాజ్‌ అశ్విన్‌ 20 లక్షలు తీసుకున్నాడట. మన బేబీ.. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య 30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్‌ తక్కువే అయినా.. నటన విషయంలో ఆ ముగ్గురూ ఎక్కడా రాజీ పడలేదు. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.

ఈ సినిమా యూత్‌కు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా 2కే కిడ్స్‌ ఈ సినిమాను తమ జీవితాలకు అన్వయించుకుంటున్నారు. ఎమోషనల్‌ అయిపోయి పదే పదే సినిమాకు వెళుతున్నారు. కాగా, ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ‘ఆహా’ సొంత చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌ దాదాపు 10 లక్షల రూపాయలు కాగా.. కేవలం ఓటీటీ రైట్స్‌ నుంచి ఏకంగా 8 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. మరి, బేబీ సినిమా  హీరో,హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique