iDreamPost
android-app
ios-app

ఆయన నన్ను బేబిలా చూసుకున్నారు.. వేదికపై కంటతడి పెట్టుకున్న వైష్టవి!

  • Published Jul 13, 2023 | 10:17 AM Updated Updated Jul 15, 2023 | 7:52 AM
  • Published Jul 13, 2023 | 10:17 AMUpdated Jul 15, 2023 | 7:52 AM
ఆయన నన్ను బేబిలా చూసుకున్నారు.. వేదికపై కంటతడి పెట్టుకున్న వైష్టవి!

‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’ వెబ్‌ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు వైష్టవి. ఇప్పుడు యూట్యూబ్‌నుంచి వెండి తెరపైకి అడుగుపెట్టారు. ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోలు ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, హీరోయిన్‌ వైష్టవి, దర్శకుడు సాయి రాజేష్‌తో పాటు ఇతర సినిమా సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైష్టవి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ బేబీ గురించి చెప్పాలంటే.. ఇది ఒక రియాలిటీ. నిజ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ. మీరు ఎ‍క్కడో ఓ చోట కథతో కనెక్ట్‌ అవుతారు. యూట్యూబ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు కళ్లకు అద్దుకుని చేసుకునేదాన్ని. సడెన్‌గా బేబీ అనే సినిమా నా లైఫ్‌లోకి వచ్చింది. నాపైన నాకు నమ్మకం లేని సమయంలో.. మొదట నన్ను నమ్మింది. నేను చేయగలను అని అనుకుంది రాజేష్‌ గారు. నేను హీరోయిన్‌ అవుదామని వచ్చాను. చాలా నేర్చుకున్నాను. చాలా క్యారెక్టర్‌ రోల్స్‌ చేసినా.. బేబీ నా దగ్గరకు వచ్చినపుడు నా మీద నాకు నమ్మకం లేదు.

ఇదంతా వేరే జోన్‌ అనుకునేదాన్ని. అప్పుడు ఆయన నాకు ఒక్కటే చెప్పాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో బేబీ క్యారెక్టర్‌ నాకు కనిపించింది. నువ్వు భయపడకు అని అన్నారు. మంచి అవకాశం వచ్చింది. నేను ఏం చేయాలి? ఎట్ల చేయాలి? అన్న దాంట్లోనే ఉన్నా. నేను ఎందుకూ పనికిరాను అని తీసిపడేసిన రోజులు ఉన్నాయి. అవి ఫేస్‌ చేసిన.. నాకు అన్ని సమయాల్లో ఆయన అండగా నిలిచారు. నాకు మా అమ్మానాన్న జన్మనిస్తే.. మీరు నాకు పునర్జన్మ నిచ్చారు. మీ వల్ల నేను ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎస్‌కేఎన్‌ సార్‌ నన్ను ముందుకు నడిపించారు. నన్ను ఓ బేబీలాగా చూసుకున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet