iDreamPost
android-app
ios-app

తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్!

  • Author ajaykrishna Updated - 08:02 AM, Mon - 17 July 23
  • Author ajaykrishna Updated - 08:02 AM, Mon - 17 July 23
తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్!

సినీ ఇండస్ట్రీలో కొత్తగా కెరీర్ ప్రారంభించిన హీరోలకు, హీరోయిన్స్ కి ఎవరికైనా ఫస్ట్ హిట్ అనేది ఎంతో స్పెషల్ అవుతుంది. స్టార్స్ అయినా, యంగ్ స్టర్స్ అయినా ఇండస్ట్రీలో అడుగు వేశాక పరుగులు పెట్టేది హిట్స్ కోసమే. సో.. ఆ హిట్ మొదటి సినిమాతో వస్తే.. ఆనందమే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం డెబ్యూ మూవీ బిగ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోస్ తో బాగా పాపులర్ అయిన వైష్ణవి.. ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. కట్ చేస్తే.. బేబీ మూవీలో హీరోయిన్ అవకాశం వరించింది. దీంతో వచ్చిన ఛాన్స్ ని బాగా యూజ్ చేసుకొని మంచి నటన కనబరచింది.

ఇంకేముంది.. ఇటీవల విడుదలైన బేబీ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ దక్కింది. అంతే.. సినిమాలో హైలైట్ గా నిలిచిన అంశాలలో వైష్ణవి నటన ఒకటి. డెబ్యూ హీరోయిన్ అయినప్పటికీ.. ఓ రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేసిందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బేబీకి ముందు వైష్ణవి.. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లిగా నటించింది. ఆ పాత్ర చిన్నదే అయినా.. అమ్మడికి హీరోయిన్ ఆఫర్స్ కూడా తీసుకొచ్చిందట. కానీ.. డెబ్యూ మూవీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని వెయిట్ చేసి.. బేబీ మూవీకి ఓకే చెప్పిందట. సినిమా షూటింగ్ అయ్యింది.. ప్రమోషన్స్ గట్టిగా చేశారు.. లాస్ట్ కి హిట్టు కొట్టేశారు.

ఈ క్రమంలో హీరోయిన్ వైష్ణవి కెరీర్ లో ఫస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా సక్సెస్ కొట్టారంటే.. ఖచ్చితంగా వారు ఆ సినిమాకి ఎంత తీసుకున్నారు? అనే పాయింట్ అందరికి ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే.. వైష్ణవి విషయానికి వస్తే.. టిక్ టాక్, యూట్యూబ్ ద్వారా కొంత క్రేజ్ వచ్చినప్పుడు కొన్ని ఈవెంట్స్ లో డాన్స్ చేసే ఛాన్స్ వచ్చిందట. తాను డాన్స్ చేసిన ఫస్ట్ ఈవెంట్ లో వైష్ణవికి రూ. 700 రెమ్యూనరేషన్ ఇచ్చారని.. బేబీ రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో తెలిపింది. అయితే.. ఇప్పుడు నటిగా మారాక తనకు ఎంత అమౌంట్ వస్తున్నా.. ఫస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా స్పెషల్ అని చెప్పింది వైష్ణవి. ప్రస్తుతం బేబీ మూవీ సక్సెస్ తో వైష్ణవి పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వైష్ణవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş