iDreamPost
android-app
ios-app

బేబీ సినిమా దర్శకుడి మంచి మనసు.. నూనెలో పడ్డ చిన్నారికి..

  • Published Aug 03, 2023 | 8:26 AM Updated Updated Aug 03, 2023 | 8:26 AM
  • Published Aug 03, 2023 | 8:26 AMUpdated Aug 03, 2023 | 8:26 AM
బేబీ సినిమా దర్శకుడి మంచి మనసు.. నూనెలో పడ్డ చిన్నారికి..

‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సాయి రాజేష్‌. బేబీ సినిమా సాధించిన విజయంతో ఆయన రేంజ్‌ పీక్స్‌కు వెళ్లిపోయింది. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆయన నెక్ట్స్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే, సాయి రాజేష్‌ గత కొద్దిరోజుల నుంచి తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. విశ్వక్‌ సేన్‌ వర్సెస్‌ సాయి రాజేష్‌ అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ వివాదంపై సాయి రాజేష్‌ క్లారిటీ ఇచ్చారు.

తన కథకు నో చెప్పింది విశ్వక్‌ సేన కాదని అన్నారు. అసలు తను విశ్వక్‌ సేన్‌ను కలవలేదన్నారు. తాను ఏ రోజూ విశ్వక్‌ను ఇన్సల్ట్ చేయలేదన్నారు. అసలు విశ్వక్ సేన్‌కు తనకు మధ్య గొడవలేమీ లేవన్నారు. వాట్సాప్ గ్రూప్‌లో కూడా మాట్లాడుకున్నామన్నారు. ఇక, అసలు విషయానికి వస్తే సాయి రాజేష్‌ తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు. ఓ చిన్నారి ఆస్పత్రి ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేశారు. ఇంతకీ సంగతేంటంటే.. కోనసీ జిల్లాకు చెందిన గుత్తుల సూర్యబాబు అనే బాలుడు కొద్దిరోజుల క్రితం వేడి నూనెలో పడిపోయాడు.

దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంటి మీద చర్మం అంతా ఊడిపోయింది. కుటుంబసభ్యులు బాలుడ్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాలుడి శరీరం బాగా కాలిపోవటంతో చికిత్స కోసం దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు రోజుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆర్థిక స్థితి బాగోలేని కారణంగా బాలుడి కుటుంబ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు.

ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సాయి రాజేష్‌ బాలుడికి సాయం చేయటానికి ముందుకు వచ్చారు. దాదాపు 50 వేల రూపాయలు గూడుల్‌ పే చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. సాయి రాజేష్‌ చేసిన మంచి పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరి, నూనెలో పడ్డ చిన్నారి చికిత్స కోసం సాయి రాజేష్‌ సాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio