iDreamPost
android-app
ios-app

అలా అనడం కరెక్ట్ కాదు! హీరోయిన్ కామెంట్స్ పై బేబీ కౌంటర్?

  • Published Jul 13, 2023 | 10:10 AM Updated Updated Jul 13, 2023 | 10:12 AM
అలా అనడం కరెక్ట్ కాదు! హీరోయిన్ కామెంట్స్ పై బేబీ కౌంటర్?

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ గా అవకాశాలు ఇవ్వడం లేదని కొన్నాళ్ళుగా వినిపిస్తున్న వాదన. ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోయిన్స్ అందరూ దీని గురించి ఎప్పటికప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆ వచ్చే అవకాశాలు కూడా ఒకటి అరా.. వాటిలోనూ సెకండ్ హీరోయిన్ కింద ఎక్కువగా కన్సిడర్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. దీంతో చేసేదేం లేక బయట ఇండస్ట్రీలవైపు అడుగులు వేసి.. సక్సెస్ అవుతున్నారు తెలుగు భామలు. వీరిలో కొందరు సక్సెస్ అవ్వొచ్చు లేదా ఫెయిల్ అవ్వొచ్చు. కానీ.. హీరోయిన్స్ గానే సినిమాలు చేయాలనే డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికి తెలుగు హీరోయిన్స్ తమిళ, మలయాళం వైపు వెళ్లిన విషయం విదితమే.

గతంలో తెలుగు ముద్దుగుమ్మ ఆనంది.. తెలుగులో సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కొన్నాళ్ళకు హీరోయిన్ గానే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అదే బాటలో శ్రీవిద్య, రీసెంట్ గా ఈషా రెబ్బ.. ఇలా తమిళ, మలయాళంలో తమ అదృష్టాలను పరీక్షించుకున్నారు. ఈ మధ్య ఈషా రెబ్బ.. టాలీవుడ్ లో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదని ఆరోపణలు చేసింది. తెలుగు మాట్లాడటం వచ్చిన వారికేమో అవకాశాలు ఇవ్వరు.. తెలుగు తెలియకుండా ఇంగ్లీష్ వచ్చిన వారికి ఛాన్సులు ఇవ్వండి అని దర్శకనిర్మాతలకు ప్రేక్షకులు ఏమైనా సలహాలు ఇస్తున్నారా? అని కామెంట్స్ చేసింది. దీంతో ఈషా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఈషా కామెంట్స్ ని సమర్ధించిన వారు కొందరు.. కాదని వ్యతిరేకించిన వారు ఇంకొందరు. ఇదిలా ఉండగా.. తాజాగా బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. మూవీ ప్రమోషన్స్ లో ఇండైరెక్ట్ గా ఈ టాపిక్ పై రియాక్ట్ అయింది. ‘హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరనే ప్రచారం ఎలా వచ్చిందో తెలియదు. అలా ప్రచారం చేయడం వల్లే.. నిజంగా అవకాశాలు ఇవ్వరేమో అని చాలామంది అమ్మాయిలు ప్రయత్నాలు చేయకుండానే దూరం అవుతున్నారు. ప్యాషన్ ఉండి.. నిరంతరం ప్రయత్నిస్తే తప్పకుండా ఏదొక రోజు ఛాన్స్ వస్తుంది. వెంటనే రావాలంటే ఏది రాదు. అందుకు టైం పడుతుంది.’ అని చెప్పుకొచ్చింది. దీంతో వైష్ణవి కామెంట్స్ ఈషా వ్యాఖ్యలపై కౌంటర్ గానే వేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అనే అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş