iDreamPost
android-app
ios-app

వీడియో: తల్లిదండ్రులను తలచుకొని బాబు మోహన్ ఎమోషనల్!

  • Author ajaykrishna Updated - 04:00 PM, Wed - 9 August 23
  • Author ajaykrishna Updated - 04:00 PM, Wed - 9 August 23
వీడియో: తల్లిదండ్రులను తలచుకొని బాబు మోహన్ ఎమోషనల్!

ఒకప్పుడు వెండితెరపై నటులుగా వెలుగు వెలిగిన వారంతా.. మెల్లగా బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్.. ప్రస్తుతం బుల్లితెర పాపులర్ టాలెంట్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఛానల్ లో నిర్వహిస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 6’లో బాబు మోహన్ ఒక జడ్జిగా ఉన్నారు. సినీ నటుడిగా.. స్టార్ కమెడియన్ దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించిన ఆయన.. సినిమాల నుండి విరామం తీసుకున్న తర్వాత రాజకీయాలలోను రాణించారు. అయితే.. తాజాగా ఆయన జడ్జిగా ఉన్న డ్రామా జూనియర్స్ షోకి సంబంధించి కొత్త ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

ఆ ప్రోమో చూసినట్లయితే.. బాబు మోహన్ చాలా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. సీరియల్ ఆర్టిస్ట్ లు రవికిరణ్ – సుష్మ చేసిన స్కిట్ లో.. చాలా ఎమోషనల్ పాయింట్స్ ని టచ్ చేశారు. ఆ స్కిట్ చూసిన బాబు మోహన్.. భావోద్వేగానికి గురై.. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మాటలు వీక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాబు మోహన్ మాట్లాడుతూ.. “నేను మూడో తరగతి చదివేటప్పుడు మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా నాన్న ఎటో వెళ్లిపోయారు. మేం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మాటలు విన్న మిగతా జడ్జిలు, షోలు ఉన్నవారు ఎమోషనల్ అయిపోయారు. కాగా.. ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. మరి నటుడు, కమెడియన్ బాబు మోహన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş