iDreamPost
android-app
ios-app

విశ్వక్ సరసన స్పెషల్ సాంగ్ లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ!

  • Published Feb 01, 2024 | 7:56 PM Updated Updated Feb 01, 2024 | 7:56 PM

Vishwak Sen Gangs Of Godavari: యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Vishwak Sen Gangs Of Godavari: యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

  • Published Feb 01, 2024 | 7:56 PMUpdated Feb 01, 2024 | 7:56 PM
విశ్వక్ సరసన స్పెషల్ సాంగ్ లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. తనదైన దూకుడు స్వభావంతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. అద్భుతమైన హిట్స్ కూడా అందుకుంటున్నాడు. విశ్వక్ సేన్ సినిమాల పరంగా ప్రయోగాలు కూడా గట్టిగానే చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక ప్రయోగమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఈ సినిమాలో విశ్వక్ రగ్గుడ్ లుక్స్, ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ కు మూవీపై అంచనాలను పెంచేశాయి. అలాగే సుట్టంలా చూసి పోకలా సాంగ్ అయితే ఇప్పటికీ యూట్యూబ్ ని షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి మరో సాంగ్ కి సంబంధించిన క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశ్వక్ సేన్ నుంచి వస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మూవీ నుంచి వచ్చిన సాంగ్, గ్లింప్స్ చూశాక అందరూ సినిమా కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించి ఇటీవల ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందంట. ఆ సాంగ్ లో ఈషా రెబ్బా విశ్వక్ తో కలిసి స్టెప్పులేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ సాంగ్ షూటింగ్ కూడా పూర్తైంది అంటూ గట్టిగానే టాలీవుడ్ లో బజ్ నడిచింది. కానీ, ఇప్పుడు అసలు విషయ బయటకు వచ్చింది.

biggboss beauty for special son in vishwak movie

అసలు విషయం ఏంటంటే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఈషా రెబ్బా డ్యాన్స్ చేయలేదు అంటున్నారు. ఆ ప్లేస్ లో ఒక బిగ్ బాస్ బ్యూటీ పాల్గొంది అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్. ఆ విషయానికి సంబంధించి బిగ్ బాస్ బ్యూటీనే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా హింట్ ఇచ్చింది. సెట్స్ లో ఉన్న ఒక ఫొటోని షేర్ చేసింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్ ఆయేషా ఖాన్. ఈ అమ్మడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్ చేసిందని సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఆయేషా ఖాన్ షేర్ చేసిన పిక్ కూడా చూడటానికి విశ్వక్ మూవీ సెట్స్ తరహాలోనే ఉంది. అంతేకాకుండా మరో స్టోరీలో హైదరాబాద్ లొకేషన్ ని పింగ్ చేసింది. వీటన్నింటినీ డీకోడ్ చేస్తూ విశ్వక్ సరసన ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేస్తోంది అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా దానినే కన్ఫామ్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

ఇంక సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ సేన్- నేహా శెట్టి- అంజలి ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 8న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్ నుంచి ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇటీవలే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గామి అనే ఒక స్పెషల్ సినిమాలో విశ్వక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి.. విశ్వక్ సేన్ సరసన ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş