iDreamPost
android-app
ios-app

మెంటల్ గా డిస్టర్బ్ చేశారు.. చనిపోవాలనుకున్నా- జానీ భార్య

  • Published Sep 21, 2024 | 2:14 PM Updated Updated Sep 21, 2024 | 4:10 PM

Jani Master wife Ayesha: జానీ మాస్టర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య ఆయేషా పై కూడా మరోసారి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అయేషా తాను చనిపోవాలనుకుంటున్నంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Jani Master wife Ayesha: జానీ మాస్టర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య ఆయేషా పై కూడా మరోసారి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అయేషా తాను చనిపోవాలనుకుంటున్నంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Sep 21, 2024 | 2:14 PMUpdated Sep 21, 2024 | 4:10 PM
మెంటల్ గా డిస్టర్బ్ చేశారు.. చనిపోవాలనుకున్నా- జానీ భార్య

మహిళ కొరియోగ్రాఫర్ ను అత్యాచారం చేసిన ఆరోపణలపై.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ కేసులో జానీతో పాటు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పై కూడా బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆయేషా పేరు కూడా నెట్టింట మారు మోగిపోతుంది. ఈ క్రమంలోనే పలు మీడియా కథనాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయేషా తాను చనిపోవాలనుకున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఆయన జానీ మాస్టర్ భార్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చనిపోవాలనుకున్నా, సుసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ.. ‘నేను ఈ కేసులో జానీ భార్యగా పోరాడటం లేదు, ఓ మహిళగా పోరాడి.. ఓ అబ్బాయిని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జానీ మాస్టర్, మహిళ కోరియోగ్రాఫర్ వ్యవహారంలో జానీ తప్పు ఏమీ లేదు. ఆ అమ్మాయే మొదటి నుంచి జానీ మాస్టర్ పై కన్నేసింది. ఈ క్రమంలోనే ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేది. మరోవైపు నన్ను వదినా అంటునే.. పక్కకి వెళ్లి జానీని బావ అని పిలిచేది. ముఖ్యంగా జానీ మాస్టర్ విషయంలో జరిగిదంతా ఓ హనీ ట్రాప్. ఈ మొత్తం వ్యవహారంలో ఆ అమ్మాయి తల్లికి కూడా భాగం ఉంది.

కావాలనే వీరంతా మాస్టర్ దగ్గర డబ్బులను,లగ్జరీ లైఫ్ ను అనుభవించాలని ఆయనను ట్రాప్ చేశారు. ఒకనొక సమయంలో.. ఆ అమ్మాయి నాతో డబుల్ గేమ్స్ ఆడుతూ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. దీంతో నేను తట్టుకోలేక సుసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ముఖ్యంగా నా పిల్లల్నీ కూడా దూరం చేయాలని చూసింది. నేను చాలా నరకం చూశాను. ఓ పెళ్లైన మగవాడిని కోరుకొని, ఆయనను నువ్వు లేకపోతే చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో చాలా వరకు మాస్టర్ ఆమె మాటాలకు లోంగిపోయారు. అయితే ఇదే ఈరోజు ఆయనకు శాపంగా మారింది. ఇంతటి దుర్మర్గమైన ఆలోచనకు దారి తీసి, ఆయనను ఇరికించేలా చేశారంటూ’ ఆయేషా వాపోయారు.

ఇక జానీ మాస్టర్ విషయానికొస్తే.. ఆయనకు ఈ కేసులో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా, ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఖైదిగా ఉన్నారు.  అలాగే నేడు (శనివారం) ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. అయితే మరో పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు జానీ మాస్టర్‌పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు. మరి, జానీ మాస్టర్ భార్య చనిపోవాలనుకున్నా అంటూ చేసిన కామెంట్స్ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş