iDreamPost
android-app
ios-app

Marvel: MCU లో ఐరన్ మ్యాన్ కొత్త క్యారెక్టర్ తో ఎంట్రీ.. నేమ్, మాస్క్ ఇదే

  • Published Jul 28, 2024 | 4:45 PM Updated Updated Jul 28, 2024 | 4:45 PM

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు.. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మార్వెల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు.. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మార్వెల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 28, 2024 | 4:45 PMUpdated Jul 28, 2024 | 4:45 PM
Marvel: MCU లో ఐరన్ మ్యాన్ కొత్త క్యారెక్టర్ తో ఎంట్రీ.. నేమ్, మాస్క్ ఇదే

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర.. వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రం ఏదైనా ఉందంటే.. కచ్చితంగా అందరూ చెప్పేది.. ‘డెడ్ పూల్ & వుల్వరిన్’ మూవీ గురించే. ముఖ్యంగా మార్వెల్ ఫ్యాన్స్ కు ఈ సినిమాతో చాలానే సప్రైజ్ లు అందించారు మేకర్స్. హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు.. హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ మూవీ మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ వరకు అవెంజర్స్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మార్వెల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి లాస్ట్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్.. ఈ సినిమా క్లైమాక్స్ లో అవెంజర్స్ కథ ముగిసిందనే అర్ధం వచ్చేలా మూవీని ఎండ్ చేసారు. దీనితో మార్వెల్ ఫ్యాన్స్ కాస్త అప్ సెట్ అయ్యారు. కానీ ఇప్పుడు వారికోసం ఓ అదిరిపోయే అప్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ అవెంజర్స్ ఫ్రాంచైజీలో కొనసాగింపుగా.. రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. ‘అవెంజర్స్ డూమ్స్ డే’ , ‘అవెంజర్స్ సీక్రెట్ వార్స్’ . వీటిలో మొదటి సినిమాను 2026 మే లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.. తాజాగా సాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. అయితే మార్వెల్ సూపర్ హీరోస్ లో ఐరన్ మ్యాన్ కు ఉన్న స్పెషల్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ క్యారక్టర్ లో నటించారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ పాత్రను ముగించేశారు. దీనితో మళ్ళీ ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరు ఊహించని విధంగా.. మళ్ళీ రాబర్ట్ డౌనీ జూనియర్ అవెంజర్స్ లోకి వస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు.

Iron Man

అయితే, ఈసారి రాబర్ట్ డౌనీ జూనియర్ హీరోగా కాకుండా విలన్ లా కనిపించనున్నాడు. మార్వెల్ యూనివర్స్ లో డాక్టర్ డూమ్ క్యారక్టర్ లో కనిపించనున్నట్లుగా రివీల్ చేశారు. సాన్ డియాగోలో జరిగిన ఈవెంట్ లో మాస్క్ తో వచ్చి.. ఆ మాస్క్ తీయగానే ఆడియన్సు అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచుతున్నారు.. మార్వెల్ లవర్స్. ఇక ఈసారి ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తారో వేచి చేయాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Marvel Studios (@marvelstudios)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet