iDreamPost
android-app
ios-app

స్టార్ కమెడియన్ కు క్యాన్సర్! ఆ డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ వల్ల..

  • Author Soma Sekhar Published - 11:24 AM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 11:24 AM, Tue - 18 July 23
స్టార్ కమెడియన్ కు క్యాన్సర్! ఆ డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ వల్ల..

వెండితెరపై ఎంతో మంది హాస్యనటులు ఉన్నారు. వారు ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై ఎందరో కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అయితే ఇలా నవ్వించే కొందరి కమెడియన్ల జీవితాల్లో మాత్రం నవ్వు ఉండదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ క్యన్సర్ తో బాధపడుతున్నట్లు స్వయంగా అతడే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ వ్యాధిని సకాలంలో గుర్తించినప్పటికీ.. ఓ డాక్టర్ ఇచ్చిన తప్పుడు ట్రీట్ మెంట్ వల్ల అతడి ఆరోగ్యం మరింతగా క్షిణీంచినట్లు చెప్పుకొచ్చాడు.

స్టార్ కమెడియన్ అతుల్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ బాలీవుడ్ లో ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండడు అంటే అతిశయోక్తికాదు. అంతలా తన టైమింగ్, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కాగా.. ‘ది కపిల్ శర్మ షో’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అతుల్ పర్చురే. తన కామెడీతో తక్కువ కాలంలోనే బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అయితే తాను లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో అతుల్ మాట్లాడుతూ..”నాకు పెళ్లై 25 సంవత్సరాలు అవుతోంది. నేను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. కానీ గత కొన్ని రోజులగా తినడంలో బాగా ఇబ్బందిగా అనిపించింది. దాంతో నా శరీరంలో ఏదో జరుగుతుందని గ్రహించాను. అయితే నా ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. నా సోదరుడు నాకు మెడిసిన్ తెచ్చి ఇచ్చాడు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆస్పత్రికి వెళ్లగా.. నాకు ‘అల్ట్రాసోనోగ్రఫీ’ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. నా లివర్ లో 5 సెంటీమీటర్ల కణితి ఉందని, అది క్యాన్సర్ అని తెలిసింది. అయితే వ్యాధిని సరైన సమయంలో గుర్తించినప్పటికీ.. ఓ డాక్టర్ తప్పుడు ట్రీట్ మెంట్ అందించడం వల్ల పరిస్థితి మరింతగా దిగజారింది” అని కమెడియన్ అతుల్ చెప్పుకొచ్చాడు.

కాగా.. ప్రస్తుతం అతుల్ పర్చురే వేరే డాక్టర్ వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. అనారోగ్య కారణంతో నేను సరిగ్గా మాట్లాడలేక పోయానని తెలిపారు అతుల్. ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. ప్రముఖ మరాఠీ నటుడైన అతుల్.. ది కపిల్ శర్మ షోలో సమోనా తండ్రి పాత్రలో నటించారు. ఈ షోలతో పాటుగా ‘కామెడీ నైట్ విత్ కపిల్’, ‘ఆర్ కె లక్ష్మణ్ కి దునియా’ లాంటి మరిన్ని షోలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అతుల్ పర్చురే.

ఇదికూడా చదవండి: నయం కాని వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా.. ఆందోళనలో ఫ్యాన్స్‌!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss