iDreamPost
android-app
ios-app

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటించిన సినిమా ఏదో తెలుసా?

  • Published Jan 03, 2024 | 9:47 AM Updated Updated Jan 03, 2024 | 1:07 PM

Venu Swamy Acting in Old Movies: వేణు స్వామి అనగానే.. సెలబ్రిటీల గురించి జ్యోతిష్యాలు చెప్తాడు అనే విషయమే అందరికి గుర్తుకు వస్తుంది. కానీ ఆయన సినిమాల్లో నటించారని మీకు తెలుసా.. ఇంతకు వేణు స్వామి ఏ సినిమాలో నటించాడంటే..

Venu Swamy Acting in Old Movies: వేణు స్వామి అనగానే.. సెలబ్రిటీల గురించి జ్యోతిష్యాలు చెప్తాడు అనే విషయమే అందరికి గుర్తుకు వస్తుంది. కానీ ఆయన సినిమాల్లో నటించారని మీకు తెలుసా.. ఇంతకు వేణు స్వామి ఏ సినిమాలో నటించాడంటే..

  • Published Jan 03, 2024 | 9:47 AMUpdated Jan 03, 2024 | 1:07 PM
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటించిన సినిమా ఏదో తెలుసా?

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాక చాలా మంది సెలబ్రిటీలు.. వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. రష్మిక మందన్నా సహా పలువురు సెలబ్రిటీలు ఇలా వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక సమంత-నాగ చైతన్య విడాకుల తర్వాత.. వేణు స్వామి క్రేజ్ మరింత పెరింగింది.

వీరిద్దరూ విడిపోతారంటూ వేణు స్వామి ముందే చెప్పడం.. వారి విడాకుల తర్వాత.. ఈ వీడియో వైరల్ కావడంతో.. వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు  తెలిసింది. ఆ తర్వాత అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు గురించి ఆయన చెప్పిన జ్యోతిష్యం వీడియోలు తరచుగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి వేణుస్వామికి సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. కానీ అది సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యం వీడియో కాదు. వేణు స్వామి నటించిన సినిమాకు సంబంధించిన వీడియో.  ఆ వివరాలు..

venuswami acted in movie

వేణు స్వామి అనగానే జ్యోతిష్యుడు అనే అందరికి గుర్తుకు వస్తుంది. కానీ ఆయన సినిమాల్లో కూడా నటించాడని మీకు తెలుసా.. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇంతకు ఆయన నటించిన సినిమా ఏది.. ఏ పాత్రలో నటించాడు అంటే.. జగపతిబాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో వేణు స్వామి నటించాడు. ఆ చిత్రంలో గుడిలో పూజలు చేసే అర్చక స్వామి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో జగపతిబాబు పక్కన రక్షిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వేణు స్వామికి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. ఇదేకాక.. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడులో కూడా వేణు స్వామి ఉన్నాడు. హీరోయిన్ సోదరి పెళ్లి చేసే పురోహితుడి పాత్రలో కనిపించాడు వేణు స్వామి.

ఇదిలా ఉంచితే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, వారి కెరీర్ గురించి జ్యోతిష్యం చెబుతూ.. యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు వేణుస్వామి. అంతేకాక గతంలో తాను ఎన్నో సినిమాలకు పని చేశానని.. అనేక చిత్రాలకు ముహూర్తాలు పెట్టడం దగ్గర నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పని చేశానని చెబుతూ ఉండేవాడు. అదలా ఉంచితే.. వేణు స్వామికి ఇండస్ట్రీలోని అనేక మంది పెద్దలతో దగ్గరి పరిచయాలే ఉన్నాయి. ఆయన సోషల్ మీడియా చూస్తే.. ఈ విషయం అర్థం అవుతుంది.

ఇక ఈ మధ్యకాలంలో ప్రభాస్ కెరియర్ అయిపోయిందంటూ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు వేణు స్వామి. డార్లింగ్ సలార్ సినిమాతో భారీ హిట్ కొడితే.. వేణు స్వామి మాత్రం.. ప్రభాస్ చేసే సినిమాలన్ని ఫెయిల్ అవుతాయని.. రెబల్ స్టార్ కెరీర్ ముగిసిపోతుందని కామెంట్స్ చేసి.. అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ బారిన పడ్డాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss