iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అతన్ని ట్రాప్‌ చేసింది! సంచలన విషయం వెలుగులోకి..

  • Published Jul 16, 2024 | 11:38 AM Updated Updated Jul 16, 2024 | 11:38 AM

Malvi Malhotra: గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్– లావణ్యల మధ్య వ్యవహారంలో రోజుకోక ఎపిసోడ్ మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యగా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై మరో సంచలన ఆరపణలు వెలుగులోకి వచ్చాయి.

Malvi Malhotra: గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్– లావణ్యల మధ్య వ్యవహారంలో రోజుకోక ఎపిసోడ్ మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యగా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై మరో సంచలన ఆరపణలు వెలుగులోకి వచ్చాయి.

  • Published Jul 16, 2024 | 11:38 AMUpdated Jul 16, 2024 | 11:38 AM
హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అతన్ని ట్రాప్‌ చేసింది! సంచలన విషయం వెలుగులోకి..

టాలీవుడ్ యంగ్ నటుడు రాజ్ తరుణ్– లావణ్యల మధ్య వ్యవహారంలో రోజుకోక ఎపిసోడ్ మలుపు తిరుగుతుంది. కాగా,ఇప్పటికే ఈ కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.అయితే మొదట లావణ్య రాజ్ తరుణ్, మాల్వీ పై కేసు పెట్టింది. అంతేకాకుండా.. మాల్వీ మాల్హోత్రా సోదరుడు తనని చంపేస్తానని బెదిరిస్తున్నరాని పోలీసులు స్టేషన్ లో కంఫ్లైట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక అందులో మొదట రాజ్ తరుణ్ ఏ1 గా చేర్చగా, లావణ్య ఏ2గా, ఆమె సోదరుడిని ఏ3 లుగా పోలీసులు కేసు ఫైల్ చేసినట్లు సమాచారం వినిపిచింది. అంతేకాకుండా.. మరోవైపు రాజ్ తనని మోసం చేశాడని, తనకి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య పోలీసులను పరుగులు పెట్టించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్టు చోటు చేసుకుంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై మరో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా పై లావణ్య  పలు ఆరోపణలు చేసింది. ముఖ్యంగా మాల్వీ మల్హోత్రా మాయలో పడి రాజ్ తరుణ్ తనిని ప్రేమించి మోసం చేశాడని, ఇక మాల్వీ తనని చంపేస్తానని బెదిరిస్తుందని తీవ్ర ఇద్దరి పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం ఎవరికి వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఈ కేసు రోజుకొక ఎపిసోడ్ ట్వీస్టుల మీద ట్వీసలతో సాగుతుంది. ఇలాంటి సమయంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.  తాజాగా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. కాగా,  ప్రేమ పేరుతో తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని మాల్వీ పై ఆరోపణ చేసింది. అలాగే ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు కూడా పంపించిందని పేర్కొంది.

అంతేకాకుండా.. యోగేష్ ను మాల్వీ ట్రాప్ చేసి ప్రేమలో పడేసిందని, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆరోపించింది. ఆ తర్వాత తప్పుడు కేసులతో తమ కుమారుడిని జైలుకు పంపించిందంని వాపోయింది. నాలుగేళ్లుగా మాల్వీ తమను ఇబ్బంది పెడుతోందంటూ అసిస్టెంట్ ప్రడ్యూసర్ తల్లి కంటతడి పెట్టింది. కాగా, 2020లో ముంబైలో ఉన్నప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేయడం సంచలనం సృష్టించింది.  అయితే అప్పటిలో మాల్వీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అప్పుడు జరిగిన అన్ని విషయాలను యోగేష్ తల్లి ఇప్పుడు మీడియా ఎదుట బయటపెట్టడం సంచలనం రేపుతోంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలపై  మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అవతుందో లేదో చూడాలి. మరి, మాల్వీ మల్హోత్రా పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

marsbahis girişjojobet